Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమిత్ షా గారూ.. మా విశాఖను కబ్జాకోరుల నుంచి రక్షించండి...

Advertiesment
jana jagarana samiti
, ఆదివారం, 18 జూన్ 2023 (15:18 IST)
కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు జన జాగరణ సమితి నిర్వాహకులు ఓ విజ్ఞప్తి చేశారు. కబ్జాకోరుల నుంచి మా విశాఖపట్టణాన్ని రక్షించాలంటూ వైజాగ్ వ్యాప్తంగా గోడలకు పోస్టర్లు అంటించారు. నగరంలో భూకబ్జాలు, గనులు, ఇసుక దోపిడీ, గంజాయి మాఫియా, క్రికెట్ బెట్టింగులు, దోపిడీలు, చైన్ స్నాచింగ్‌లు పెరిగిపోతున్నాయంటూ అర్థమొచ్చేలా ఈ పోస్టర్లను ముద్రించి నగర వ్యాప్తంగా అంటించారు. ల్యాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా, గంజా మాఫియా, క్రికెట్ బెట్టింగ్స్, మర్డర్లు, కిడ్నాప్‌లు ఇలా అన్నీ పెరిగిపోతున్నాయని, అందువల్ల వైజాగ్‌ను రక్షించాలంటూ జన జాగరణ సమితి విన్నవించింది.
 
ఇదేవిషయంపై ఆ సమితి రాష్ట్ర కన్వీనర్ వాసు మాట్లాడుతూ, ప్రశాంతతకు మారుపేరైన విశాఖలో భూములకు రక్షణ లేకుండా పోయిందని వాపోయారు. భూకబ్జాలు, గంజాయి గురించిన వార్తలు తరచూ వింటుంటే చాలా బాధగా ఉందన్నారు. సాక్షాత్తూ విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబ సభ్యులను ఏకంగా కిడ్నాప్ చేసి రెండు రోజులపాటు నిర్బంధించడంతో ఆయన విచారం వ్యక్తం చేశారు. అరాచక శక్తులకు అడ్డాగా విశాఖ మారిందంటూ వ్యాఖ్యానించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా... ఇపుడు విశాఖను రక్షించాల్సిన బాధ్యత తీసుకోవాలని ఆయన కోరారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు వెల్లడి.. టాప్ లేపిన హైదరాబాద్ కుర్రోడు