Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జగన్ పాదయాత్ర 2.0.. దాదాపు 5వేల కిలోమీటర్ల ప్రయాణం.. 2029 ఎన్నికలకు కలిసొస్తుందా?

Advertiesment
ys jagan
2019లో వైకాపా చీఫ్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆవిర్భవించడానికి ప్రధాన కారణాలలో ఒకటి ప్రజా సంకల్ప యాత్ర. జగన్‌ను ప్రజలకు దగ్గరగా చేసిన ప్రజాసంకల్ప కార్యక్రమాలలో ఇది ఒకటి. 2019లో జగన్ ప్రజల మద్దతు పొంది ముఖ్యమంత్రి అయ్యే వరకు అంతా బాగానే ఉంది. 
 
కానీ ఆ తర్వాత ఆయన ప్రవర్తనలో వచ్చిన మార్పు వచ్చిందనే చెప్పాలి. ప్రజలను కలవడానికి ఇష్టపడకపోవడం కారణంగా 2024లో ఆయనను ఓడిపోయేలా చేసింది. ఇప్పుడు 2029 ఎన్నికల్లో ముఖ్యమంత్రి పదవిని చేపట్టడానికి జగన్ ఇలాంటి ఫార్ములాను అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది.
 
జగన్ రాబోయే పాదయాత్ర 2.0లో జగన్ దాదాపు 5000 కి.మీ.లు ప్రయాణించనున్నారు. ఆంధ్రప్రదేశ్ అంతటా ఈ మెగా పాదయాత్ర ప్రారంభించాలని జగన్ చాలా దృఢంగా నిర్ణయించుకున్నారని వైసీపీ నేత వెంకట్ రెడ్డి అన్నారు.  2019లో జగన్ అన్నా 3600 కి.మీ.ల దూరం ప్రయాణించగా, ఈసారి ఆయన 5000 కి.మీ.ల దూరం ప్రయాణించనున్నారు.

ఆయన ఈ పాదయాత్రలో 15 నెలలు గడుపుతారు. ఒకసారి ఆయన ఇంటి నుంచి బయలుదేరితే, యాత్ర పూర్తయ్యే వరకు, ఎన్నికల ప్రచారం ముగిసే వరకు వెనక్కి తగ్గే అవకాశం లేదు.. అని వెంకట్ రెడ్డి అన్నారు. 
 
దీనిని బట్టి చూస్తే, జగన్ 2028 ప్రారంభ దశల్లో పాదయాత్రను ప్రారంభించి, 2029లో ఓటర్ల జాబితా వరకు కొనసాగించే అవకాశం ఉంది. మరి ఈ పాదయాత్ర జగన్‌కు కలిసొస్తుందే లేదో వేచి చూడాలి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దిత్వా తుఫాను- నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలకు ఆకస్మిక వరద హెచ్చరికలు