Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇంకా తానే సీఎం అనే భావనలో జగన్ ఉన్నారు : పవన్ కళ్యాణ్

Advertiesment
pawan kalyan

వరుణ్

, సోమవారం, 22 జులై 2024 (16:51 IST)
వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికీ తత్వం బోధపడటం లేదని, ఇప్పటికీ తానే ముఖ్యమంత్రి అని భావనలో ఉన్నారని జనసేన పార్టీ అధినే, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విమర్శించారు. జగన్‌కు ఇంకా తత్వం బోదపడలేదని అన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కూడా గడవక ముందే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. 
 
సోమవారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, పల్నాడు జిల్లా వినుకొండలో జరిగిన హత్య ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ కారణమని, దానికి రాజకీయ రంగు పులిమారని విమర్శించారు. అవాస్తవాలను చెబుతూ కుట్రలకు తెర లేపుతున్నారని దుయ్యబట్టారు. ఇప్పటికీ తానే సీఎం అని జగన్ అనుకుంటుంన్నారని ఎద్దేవా చేశారు. 
 
ఎల్లకాలం సీఎంగానే ఉంటాననే భ్రమల్లోంచి జగన్‌ను ప్రజలు బయటపడేశారని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు తాను, తమ పార్టీ సంపూర్ణంగా సహకరిస్తుందని తెలిపారు. రాష్ట్ర పురోగతికి చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా పుర్తిగా మద్దతు ఇస్తామని పవన్ కళ్యాణ్ మరోమారు సభా వేదికగా ప్రకటించారు. 
 
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదంపై సీఎం బాబు సీరియస్... 
 
నంద్యాల జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అనుమానాస్పదంగా అగ్నిప్రమాదం సంభవించింది. కొత్త సబ్ కలెక్టర్ బాధ్యతలు స్వీకరించడానికి కొన్ని గంటలు ముందు ఈ ప్రమాదం జరగడం అనేక అనుమానాలకు తావిస్తుంది. దీంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ప్రమాదంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మదనపల్లె వెళ్లి అగ్నిప్రమాద  ఘటనపై నిగ్గు తేల్చాలని డీజీపీ, సీఐడీ చీఫ్‌లను ఆదేశించారు. సీఎం ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమల రావు, ఏపీ సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యనార్ హుటాహుటిన మదనపల్లె చేరుకున్నారు. 
 
ఈ ప్రమాదంపై ఇప్పటికే పోలీసు విచారణ ప్రారంభంకాగా, డీజీపీ, సీఐడీ చీఫ్ మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని పరిశీలించనున్నారు. ఈ ఘటనపై కుట్ర కోణంలో విచారణ చేపట్టిన పోలీసులు.. సబ్ కలెక్టర్ కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ గౌతమ్‌‍ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మదనపల్లె కొత్త సబ్ కలెక్టర్ బాధ్యతలు చేపట్టడానికి కొన్ని గంటల ముందే ఈ ప్రమాదం జరగడంతో కీలఖ ఫైళ్ళను రూపుమాపేందుకు కావాలనే అగ్నిప్రమాదం సృష్టించారా అనే కోణంలో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదంపై సీఎం బాబు సీరియస్...