Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్కోచ్ అవార్డులు.. జగన్ పాలన.. ఏపీకి మూడో స్థానం..

Advertiesment
andhra pradesh

సెల్వి

, గురువారం, 15 ఫిబ్రవరి 2024 (20:22 IST)
దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్‌కు మూడో స్థానం దక్కింది. ఏపీలో ప్రభుత్వ పరిపాలన అద్భుతంగా ఉందని ఇటీవల స్కోచ్ అవార్డులు వెల్లడిస్తున్నాయి. ఏపీ మూడో స్థానంలో నిలిచింది. వైఎస్ జగన్ ప్రభుత్వానికి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. 
 
గ్రామ స్వరాజ్య స్థాపన కోసం జగన్ చేపట్టిన గ్రామ సచివాలయాలు, వాలంటీర్లు, ఇంటి రేషన్, పెన్షన్, గ్రామ వైద్యశాల, రైతు భరోసా కేంద్రం వంటి అద్భుతమైన విధానాలతో జగన్ మోహన్ రెడ్డి కొత్త సంస్కరణలను సంస్థ ప్రశంసించింది. 
 
ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుపరిపాలన, గ్రామ సచివాలయ వ్యవస్థలతో దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని కొనియాడుతున్నారు. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్‌కు అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మకమైన "స్కోచ్ - స్టేట్ ఆఫ్ గవర్నెన్స్ రిపోర్ట్ - 2023"లో ఆంధ్రప్రదేశ్ దేశంలో 3వ స్థానంలో నిలిచింది. గతేడాది 4వ స్థానంలో ఉన్న ఏపీ మూడో స్థానానికి ఎగబాకింది. 
 
ఈ క్రమంలో మొదటి స్థానంలో ఒడిశా, రెండో స్థానంలో ఉత్తరప్రదేశ్, మూడో స్థానంలో ఏపీ, నాలుగో స్థానంలో మహారాష్ట్ర, ఐదో స్థానంలో గుజరాత్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, బీహార్, మధ్యప్రదేశ్ ఆరు నుంచి పది స్థానాల్లో ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సహజీవనం సాధ్యం కాదు, చనిపోదాం రా: ప్రేయసికి విషమిచ్చి ప్రియుడు పరార్