Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

7, 8న ఇడుపులపాయకు జగన్

7, 8న ఇడుపులపాయకు జగన్
, శనివారం, 4 జులై 2020 (21:55 IST)
ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పక్కాగా నిర్వహించాలని సంబందిత అధికారులను జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ ఆదేశించారు.

ఈ నెల 7, 8 తేదీల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జిల్లాకు రానున్న నేపథ్యంలో శనివారం జిల్లా కలెక్టర్ సి. హరి కిరణ్, జేసీ సాయికాంత్ వర్మ , జిల్లా ఎస్పీ అన్బు రాజన్ లు పడా ఓఎస్డీతో కలిసి ఇడుపులపాయలో పలు ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు.

అయితే ఇంకనూ అధికారిక దృవీకరణ పర్యటన రావాల్సి ఉందన్నారు. ఈ సందర్భంగా   హెలిపాడ్, త్రిబుల్ ఐటి, వైఎస్ఆర్ ఘాట్, వైఎస్ఆర్ నూతన విగ్రహం ఏర్పాట్లు, నూతనంగా చేపట్టనున్న నిర్మాణ పనులకు సంబంధించి శిలాఫలకాల ఏర్పాట్లను వారు పరిశీలించారు.

ఇడుపులపాయ ఎస్టేట్ లో ముఖ్యమంత్రి బసచేయనున్న దృష్ట్యా.. అక్కడి ఏర్పాట్లను క్షున్నంగా పరిశీలించారు. ముందుగా జిల్లా కలెక్టర్, జేసీ, ఎస్పీలు హెలీప్యాడ్ ను, పరిసర ప్రాంతాలను పరిశీలించారు. హెలిపాడ్ వద్దకు వచ్చే విఐపీ లకు ప్రత్యేక గ్యాలరీ,  ఏర్పాటుపై అధికారులకు సూచనలు ఇచ్చారు.

అనంతరం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ ను పరిశీలించారు. ఘాట్ వద్ద ప్రత్యేకమైన పూల అలంకరణ, పూల మాలలు, మొదలయిన అలంకరణను  శోభాయమానంగా తీర్చిదిద్దాలన్నారు. ముఖ్యమంత్రి తిరిగే పరిసరాలన్నింటినీ అత్యంత  పరిశుభ్రంగా ఉంచాలన్నారు.

అనంతరం ముఖ్యమంత్రి ప్రారంభించే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్మారక విగ్రహాన్ని కలెక్టర్ పరిశీలించారు. అలాగే ముఖ్యమంత్రి ప్రారంభించబోయే త్రిబుల్ ఐటీ తరగతి భవనాలను పరిశీలించారు.

అందులోని నైపుణ్య శిక్షణ కేంద్రం, ల్యాబులను పరిశీలించారు. నూతన నిర్మాణాలకు సంబంధించిన శిలాఫలకాల ఏర్పాటుకు సంబంధించి అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. కొవిడ్-19 నేపథ్యంలో స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రోటోకాల్(SoP) తప్పనిసరిగా పాటించాలన్నారు.

కరోనా నియంత్రణలో భాగంగా అతి తక్కువ సంఖ్యలో ముందస్తుగా అనుమతించిన వారిని తప్ప, ఇంకెవరిని కూడా ముఖ్యమంత్రి పర్యటనలో అనుమతించడం జరగదని ఈ మేరకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇడుపులపాయ ఎస్టేట్, ట్రిపుల్ ఐటిలలో పనిచేసే వారు, ముఖ్యమంత్రి పర్యటన విధుల్లో ఉన్న వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహించాలని సూచించారు. 
 
ముఖ్యమంత్రి బసచేసే గెస్ట్ హౌస్ లో అన్ని ఏర్పాట్లు పక్కాగా చేయాలన్నారు. ముఖ్యమంత్రితో పాటు వచ్చే సీఎంఓ అధికారులు, కార్యదర్శులకు ప్రత్యేక వసతి ఏర్పాట్లను చేయాలన్నారు.  ముఖ్యమంత్రి బస చేసే రోజుల్లో ఇలాంటి కొరత లేకుండా చూసి, ఆయన పర్యటనను విజయవంతం చేయడానికి పక్కాగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. 

ముఖ్యమంత్రికి పలు వినతులు అందించేందుకు.. వచ్చే వారికి ప్రత్యేక తాత్కాలిక స్పందన (గ్రీవెన్స్ సెల్) కౌంటర్లను ఏర్పాటు చేయాలన్నారు. గట్టి భద్రతతో బారికేడ్లను ఏర్పాటు చేసి వినతిపత్రాలు సేకరించేందుకు 50 మంది సిబ్బందిని కూడా ఏర్పాటు చేయాలన్నారు. ఈ నేపత్యంలో ఆర్.కె.వ్యాలీ పరిసర ప్రాంతాల్లో భద్రత ఏర్పాట్లను ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు.
 
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అన్బు రాజన్, అదనపు ఎస్పీ రిషికేశవ రెడ్డి, జెడ్పి సీఈఓ సుధాకర్, డిపిఓ ప్రభాకర్ రెడ్డి, జిఎన్ఎస్ఎస్ ఎస్డిసి సతీష్ చంద్ర, స్టెప్ సీఈవో డా.రామచంద్రా రెడ్డి, ట్రిబుల్ ఐటీ డైరెక్టర్ సుధీర్ ప్రేమ్ చాంద్, డిఎంహెచ్ఓ ఉమా సుందరి, రిమ్స్ సూపరింటెండెంట్ ప్రసాద రావు, డ్వామా పిడి యధుభూషన్ రెడ్డి,

పులివెందుల మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి, హరికల్చర్ డిడి వజ్రశ్రీ, ఏపీఎంఐపీ పీడి  మధుసూదన్ రెడ్డి,  ఆర్&బి ఎస్ఈ ,  ఎక్సైజ్ డిఎస్పీ స్వాతి, స్థానిక రెవెన్యూ అధికారులు, తదితర శాఖల అధికారులు, ఇంజనీర్లు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆరోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వాగ్దానం ఏమైంది..? చంద్రబాబు