Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నేను చనిపోయిన తర్వాత కూడా ప్రతి ఇంట్లో నా ఫోటో వుండాలి: జగన్ (video)

Advertiesment
jagan
తాను చనిపోయిన తర్వాత కూడా ప్రతి ఇంట్లో తన ఫోటో ఉండాలని కోరుకుంటున్నట్లు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్  పేర్కొన్నారు. ఆయన ఆకాంక్ష ఎంత బలంగా, అభినందనీయంగా ఉన్నప్పటికీ, గత ఎన్నికల ఫలితాలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. జగన్ పార్టీ 151 సీట్ల నుండి 11 సీట్లకు పడిపోయింది. జగన్ అనుసరించిన విధానాలు ఆశించిన ప్రభావాన్ని చూపలేదన్నది స్పష్టమవుతోంది.
 
ఈ నేపథ్యంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచిపోయాయని, ఇక మూడేళ్లు మాత్రమే మిగిలి ఉన్నాయని వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యానించారు. మరో ఏడాదిన్నరలో తాను పాదయాత్ర ప్రారంభించనున్నందున, వాస్తవ పాలనకు కేవలం ఏడాదిన్నర సమయం మాత్రమే మిగిలి ఉందని అర్థం చేసుకోవాలన్నారు. తన యాత్ర మొదలైన తర్వాత పాలనలో మార్పు వస్తుందనే సంకేతాన్ని జగన్ ఇచ్చారు.
 
ఎన్డీయే ప్రభుత్వ కాలపరిమితి, తన పాదయాత్ర పునఃప్రారంభం గురించి జగన్ పదేపదే ప్రస్తావిస్తూ వస్తున్నారు. పార్టీ శ్రేణులను తిరిగి ఉత్తేజపరిచి, వారిని మళ్లీ నిలదొక్కుకునేలా చేయాలని ఆలోచిస్తున్నారు. ఇంకా జగన్ మాట్లాడుతూ.. జగన్ 2.0లో కార్యకర్తలను బాగా చూసుకుంటానని అన్నారు. ప్రతి సంక్షేమ పథకం కార్యకర్తల ద్వారానే ప్రజలకు అందుతుందని చెప్పారు. పాదయాత్ర ద్వారా చంద్రబాబు దుర్మార్గపు పాలను స్వస్తి పలుకుతానని వెల్లడించారు. రాష్ట్రంలో అన్యాయమైన పాలన చూస్తున్నామని.. ప్రశ్నించే వారిపై దొంగకేసులు పెడుతున్నారని.. రెడ్ బుక్ రాజ్యాంగంపై మండిపడ్డారు. చీకటి కొంతకాలమే వుంటుందని.. వెలుగురాక తప్పదన్నారు జగన్. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో కొత్త భద్రతా అప్‌డేట్‌లతో టీనేజర్ల ఖాతాలను పటిష్టం చేస్తున్న మెటా