Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వెలిగొండ ప్రాజెక్ట్ టీడీపీ చేసింద‌న‌డం అవాస్తవం: డాక్టర్ ఏలూరి

వెలిగొండ ప్రాజెక్ట్ టీడీపీ చేసింద‌న‌డం అవాస్తవం: డాక్టర్ ఏలూరి
, గురువారం, 22 జులై 2021 (18:59 IST)
టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో వెలిగొండ ప్రాజెక్టు పనులు జరిగాయని ఆ పార్టీ నేతలు చేస్తున్న అసత్య ప్రచారాన్ని వైకాపా రాష్ట్ర నాయకుడు డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి తీవ్రంగా ఖండించారు. ఐదేళ్లలో పని జరిగితే ఒక ఏడాదిలో పూర్తి కావాల్సిన మొదటి టన్నెల్ నిర్మాణం... 2020 డిసెంబర్ దాకా ఎందుకు పట్టిందని ప్రశ్నించారు.

అలాగే భూ-నిర్వాసితులకు పునరావాసం ప్యాకేజి ఎందుకు మాజీ సీఎం చంద్ర‌బాబు ఇవ్వలేకపోయారో సమాధానం చెప్పాలన్నారు. తనకు వెలిగొండ ప్రాజెక్టు మీద సమగ్ర అవగాహన ఉంది కాబట్టే నిజానిజాలు ప్రజలకు వివరించానని చెప్పిన ఏలూరి.. వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తి చెయ్యమని టీడీపీ అధికారంలో ఉండగా, తాము దీక్షలు ఎందుకు చేయాల్సి వచ్చిందో కూడా ప్రజలకు బాగా తెలుసన్నారు. 
 
రాయలసీమ ప్రాజెక్టు, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుల సామర్ధ్యం పెంపు వల్ల వెలిగొండ ప్రాజెక్టుకు ఎలాంటి నష్టం లేదని... తామే కాదు, నీటిపారుదల నిపుణులు కూడా చెప్పారన్నారు. సీమలో ఉన్న ఆ రెండు ప్రాజెక్టుల తోపాటు వెలిగొండకు నీళ్లు రావాలి అంటే ముందు శ్రీశైలం రిజర్వాయర్ పూర్తిస్థాయిలో నిండాలి.. ఇది జరిగితే ముందుగా నీళ్లు వచ్చేది వెలిగొండకే అన్న విషయాన్నీ టీడీపీ గుర్తుంచుకోవాలన్నారు.

ఒకవేళ శ్రీశైలం జలాశయానికి రాకుండా ఆ రెండు ప్రాజెక్టుల ద్వారా నీటిని డ్రా చేస్తే, తెలంగాణ ఒప్పుకోదు కదా అని ప్రశ్న లేవనెత్తారు. అప్పుడు మళ్ళీ రెండు రాష్ట్రాల మధ్య నీటి గొడవలు జరుగుతాయ‌ని, ఇలా జరగకుండా ఉండకూడదనే కదా ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించింది అని స్పష్టం చేశారు. ఇకనైనా టీడీపీ నేతలు వెలిగొండ ప్రాజెక్టు మీద అవగాహన పెంచుకొని మాట్లాడాలని ఏలూరి హితవు పలికారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో 24 గంటల్లో కొత్త పాజిటివ్ కేసులెన్ని?