Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మరో వారం రోజుల పాటు జైల్లోనే చంద్రబాబు.. క్వాష్ పిటిషన్‌ను వాయిదా వేసిన సుప్రీంకోర్టు

chandrababu
, మంగళవారం, 3 అక్టోబరు 2023 (14:10 IST)
స్కిల్ డెవలప్‍మెంట్ స్కామ్ కేసులో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరో వారం రోజుల పాటు జైల్లోనే గడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తనపై అక్రమంగా నమోదు చేసిన స్కిల్ కేసును కొట్టి వేయాలంటూ ఆయన తరపున దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టి సోమవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్ అనిరుధ్ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం ఆదేశించింది. పైగా, ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో సమర్పించిన పత్రాలన్నీ సోమవారం లోపు సమర్పించాలని సీఐడీ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గని సుప్రీంకోర్టు ఆదేశించింది.
 
ఈ కేసు విచారణ సమయంలో రోహిత్గీ స్పందిస్తూ, అఫిడవిట్ వేసేందుకు సమయం కావాలని కోర్టును కోరారు. మరోవైపు, చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా స్పందిస్తూ, తాము మొత్తం వివరాలతో సిద్ధంగా ఉన్నామని సుప్రీం ధర్మాసనానికి విన్నవించారు. ఈ కేసులో చంద్రబాబు తరపున లూథ్రాతో పాటు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు హరీశ్ సాల్వే, మను సింఘ్వీ కూడా వాదనలు వినిపించారు.
 
బెయిల్ కోసం వెళ్లకుండా క్వాష్ పిటిషన్‌పైనే వాదిస్తున్నారని ఏపీ సీఐడీ న్యాయవాది ముకుల్ రోహత్గీ ఆరోపణలు చేశారు. చంద్రబాబుకు 17ఏ వర్తించదని అన్నారు. 2018లో 17ఏ సవరణ జరిగిందని, స్కిల్ నేరం అంతకుముందే జరిగిందని కోర్టుకు వివరించే ప్రయత్నం చేశారు. 2018కి ముందు జరిగిన వాటికి 17ఏ వర్తిందచని ఎలా చెబుతారని ప్రశ్నించారు. వందల కోట్ల అవినీతి జరిగిందని రోహాత్గీ పేర్కొన్నారు.
 
దీంతో న్యాయమూర్తి బేలా త్రివేది జోక్యం చేసుకుని, అవినీతి సంగతి తర్వాత, ముందు 17ఏ గురించి చెప్పండి అని సూటిగా ప్రశ్నించారు. సెక్షన్ 17ఏ అవినీతి కేసులకు మాత్రమే వర్తిస్తుందా, లేక అన్ని కేసులకు వర్తిస్తుందా? అని అడగ్గా, అన్ని కేసులకు వర్తిస్తుందని చంద్రబాబు తరపు న్యాయవాది సాల్వే బదులిచ్చారు. ఈ కేసు పూర్తిగా రాజకీయ కక్ష సాధింపుతో కూడుకున్నదని సాల్వే స్పష్టం చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోళికోడ్ తీరంలో తిమింగల కళేబరం - చూసేందుకు ఎగబడుతున్న స్థానికులు