గాయత్రి ఆత్మహత్య కేసు.. ఆడపడుచు సూసైడ్ నోట్‌ను ఏం చేసింది..?
పశ్చిమ గోదావరి ఇరగవరం గాయత్రి (24) ఆత్మహత్య కేసుపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ నెల 23న విషం తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో సూసైడ్ నోట్ అదృశ్యం కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. వివరాల్లోకి వెళితే.
పశ్చిమ గోదావరి ఇరగవరం గాయత్రి (24) ఆత్మహత్య కేసుపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ నెల 23న విషం తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో సూసైడ్ నోట్ అదృశ్యం కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఇరగవరం శివారుప్రాంతమైన గొల్లగుంటవారిపాలెంలో వేండ్ర గాయత్రి (24) అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. గాయత్రికి 2016 ఫిబ్రవరిలో అదే గ్రామానికి చెందిన వేండ్ర చంద్రరావుతో పెళ్లైంది.
ఇద్దరూ ఒకే గ్రామానికి చెందిన వారు.. పక్కింటి వారే కావడం గమనార్హం. అయితే రెండు నెలల క్రితం చంద్రరావు ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశానికి వెళ్లాడు. గాయత్రి ఈ నెల 23న విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై సోమవారం పెనుగొండ సీఐ సీహెచ్ రామారావు కేసు నమోదు చేశారు. తహసీల్దార్ జి.మమ్మి, ఎస్‌ఐ వీఎస్‌వీ భద్రరావు మృతదేహాన్ని తణుకు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
కానీ గాయత్రి మృతిపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. అందరితో కలిసిమెలసి ఉండే గాయత్రి ఎందుకు ఆత్మహత్యకు పాల్పడిందనే విషయమై స్పష్టమైన వివరాలు తెలియడం లేదు. ఆమె విషం తీసుకునేముందు ఒక లేఖ రాసిందని.. ఆ లేఖ ప్రస్తుతం కనపడట్లేదని పోలీసులు చెప్తున్నారు.
తన మృతికి ఎవరు కారణం కాదు. ఎవరిపై ద్వేషం లేదని రాసిన లేఖ తాను చూసినట్లు గాయత్రి ఆడపడుచు రాధ చెప్పింది. ఆ లేఖ ఎక్కడ ఉంది అని పోలీసులు ఆరా తీస్తే ఎక్కడో పడేశానని, ఎక్కడ ఉందో తెలియదు అని సమాధానమిచ్చింది. దీంతో ఈ కేసుపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు.