నేటి తరుణంలో స్మార్ట్‌ఫోన్స్ వాడడం ఎక్కువైపోతున్నాయి. ముఖ్యంగా వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటివే అధికంగా వాడుతున్నారు. ఇక అసలు విషయానికి వస్తే... ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ బాలికకు అబ్బాయి పరిచయమయ్యాడు. దాంతో ప్రతిరోజూ బాలిక అతనితో చాటింగ్ చేస్తూ వస్తోంది.
కొన్నిరోజులకు వారి మధ్య ప్రేమ చిగురించింది. బాలిక వయస్సు 13 ఏళ్లు. అబ్బాయి వయస్సు 22 ఏళ్లు. ఇన్‌స్టాగ్రామ్‍లో బాలికకు మాయమాటలు చెప్పిన ఇతను మార్చి 15వ తేదీన ఆమెను స్కూల్‌లో కిడ్నాప్ చేశాడు. అదే రోజు సాయంత్రం నారాయణగూడ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
మరిన్ని వివరాలను చూస్తే... బాలిక ప్రైవేట్ స్కూల్లో 8వ తరగతి చదువుతుంది. అదే స్కూలుకు చెందిన ఇద్దరు స్నేహితులతో కలిసి ప్రతిరోజూ ఇన్‌స్టాగ్రామ్ గ్రూప్‌లో చాటింగ్ చేసేది. ఈ నేపథ్యంలోనే బాలికకు పవన్ చైతన్య అనే అబ్బాయితో పరిచయం ఏర్పడింది. నేను హీరో నాగచైతన్య ఫ్యాన్‌నని చెప్పి.. రోజూ ఆమెతో చాటింగ్ చేసేవాడు. ఇక బాలిక కూడా నాగచైతన్య అభిమానే. దీన్ని ఆసరాగా తీసుకున్న అతను బాలికను ప్రేమలో పడేశాడు.
కొన్ని రోజుల తరువాత పవన్ చైతన్య బాలికను విజయనగరానికి రావాలని చెప్పాడు. కానీ, బాలిక రానని తిరస్కరించింది. దాంతో అతను నేను నీ కోసం హైదరాబాద్ వస్తే కూడా రావా.. అనడంతో బాలిక వస్తానని చెప్పింది. ఇక మార్చి 15న స్కూల్ వద్దకు వచ్చిన పవన్ ఆమెను కిడ్నాప్ చేసి సికింద్రాబాద్‌కు తీసుకెళ్ళాడు.
ఇక.. బాలిక తల్లిదండ్రులు అదే రోజున మా కుమార్తె కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారి ఆచూకి కనుగొనేందుకు రంగంలోకి దిగారు.