ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. సికింద్రాబాద్ - తిరుపతి ప్రాంతాల మధ్య రెండు రోజుల పాటు ప్రత్యేక రైళ్లను నడుపనుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ రెండు నగరాల మధ్య ప్రత్యేక రైళ్ళను నడుపనున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు ఆదివారం, సోమవారాల్లో ఈ ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయని తెలిపింది.
ఆదివారం తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు ప్రత్యేక రైలు (07097) బయలుదేరుతుంది. అలాగే, రేపు సికింద్రాబాద్ నుంచి తిరుపతికి మరో ప్రత్యేక రైలు (07098) అందుబాటులో ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ ఒక ప్రటనలో తెలిపారు.
ఈ ప్రత్యేక రైళ్లు మార్గమధ్యంలో రేణిగుంట, రాజంపేట, కడప, యర్రగుంట్ల, తాడిపత్రి, గుంతకల్, ఆదోని, మంత్రాలయం రోడ్, రాయచూర్, కృష్ణ, యాద్గిర్, తాండూర్, వికారాబాద్, లింగంపల్లి, బేగంపేట్ స్టేషన్లలో ఆగుతాయని అధికారులు వివరించారు. ఈ మార్గంలో ప్రయాణించే వారు ఈ సౌకర్యాని వినియోగించుకోవాలని రైల్వే శాఖ సూచించింది.