Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇమ్రాన్ చెంప ఛెళ్లుమనేలా తీర్పునివ్వాలి: ఓటర్లకు ఓవైసీ పిలుపు

Advertiesment
ఇమ్రాన్ చెంప ఛెళ్లుమనేలా తీర్పునివ్వాలి: ఓటర్లకు ఓవైసీ పిలుపు
, గురువారం, 11 ఏప్రియల్ 2019 (15:14 IST)
ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ గురువారం తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. నగరంలోని ఓ పోలింగ్ బూత్‌లో ఆయన ఓటు వేశారు. హైదరాబాద్ లోక్‌సభ స్థానానికి ఎఐఎం అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఒవైసీ, 2004 నుంచి ఇదే నియోజవర్గానికి ప్రాతనిధ్యం వహిస్తున్నారు. ఓటు వేసిన అనంతరం ఎంతో ఉత్సాహంగా కనిపించిన ఒవైసీ మీడియాతో మాట్లాడుతూ, పౌరులంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. 
 
ఓటు వేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుత ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీకి ఓటు వేస్తే పాకిస్థాన్‌కు వేసినట్టేనంటూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యనించడాన్ని ఆయన తప్పుబట్టారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ కలలు నిజయం కానీయరాదని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
 
నరేంద్ర మోడీ మళ్లీ ప్రధాని అయితేనే భారత్-పాక్ దేశాల మధ్య నెలకొన్న సరిహద్దు, కాశ్మీర్ వంటి ఎన్నో సమస్యలకు పరిష్కారానికి మార్గం సుగమమవుతుందన్నారు. ఇదేసమయంలో భారత్‌లో కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు అధికారంలోకి వస్తే ఇరుదేశాల మధ్య నెలకొన్న చిరకాల సమస్యలకు పరిష్కారం దుర్లభమవుతుందన్నారు. 
 
ఇమ్రాన్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఇప్పటికే మండిపడింది. మోడీ గిలిస్తే పాకిస్థాన్‌కు మేలు అనే రీతిలో ఇమ్రాన్ మాట్లాడటం చూస్తే పాకిస్థాన్ అధికారికంగా మోడీతో కలిసిపోయినట్టేనని ఆ పార్టీ వ్యాఖ్యానించింది. లెఫ్ట్, ఆమ్ ఆద్మీ పార్టీలు సైతం పాక్ మోడీ అనుకూల వైఖరిని తూర్పారబట్టాయి. భారత్ ఎన్నికల్లో మీ జోక్యం ఏమిటంటూ పాక్‌ను నిలదీశాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రపంచంలోనే అతి పొడవైన కొండచిలువ.. ఎక్కడ కనిపెట్టారంటే?