Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ట్రిపుల్ ఐటీలో అత్యుత్త‌మ ప్ర‌మాణాలు... త్వ‌ర‌లో 600 పోస్టులు భ‌ర్తీ!

Advertiesment
ట్రిపుల్ ఐటీలో అత్యుత్త‌మ ప్ర‌మాణాలు... త్వ‌ర‌లో 600 పోస్టులు భ‌ర్తీ!
విజ‌య‌వాడ‌ , బుధవారం, 24 నవంబరు 2021 (19:57 IST)
రాష్ట్రంలోని ట్రిపుల్ ఐటీలను అత్యుత్తమ విద్యా సంస్థలుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర  చెప్పారు స్థానిక త్రిబుల్ ఐటీలో బుధవారం అడ్మిషన్స్ కు సంబంధించి కౌన్సెలింగ్‌ను ఆయన ప్రారంభించారు.  ఈ సందర్భంగా ట్రిపుల్ ఐటిలోని ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్ధినీ విద్యార్థులను ఉద్దేశించి సతీష్ చంద్ర మాట్లాడుతూ, రాష్ట్రంలోని ట్రిపుల్ ఐటీ లను అత్యుత్తమ విద్యాసంస్థలుగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి చిత్తశుద్ధితో ఉన్నారన్నారు.
 
 
రాష్ట్రంలోని ట్రిపుల్ ఐటీ లలో ఖాళీగా ఉన్న 600 అధ్యాపకుల పోస్టులను  త్వరలో భర్తీ చేయనున్నట్లు ఆయన చెప్పారు.  విద్యార్థులు ఏ విషయాలలోనూ మానసిక ఒత్తిడికి గురికాకుండా ఉండేవిధంగా ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక అధ్యాపకులను అనుసంధానం చేసి వారి విద్యా ప్రగతిని నిశితంగా పరిశీలించడంతో పాటు, వారి విద్య, వ్యక్తిగత సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటారన్నారు.   ట్రిపుల్ ఐటీ లలో ల్యాబ్ , లైబ్రరీ, కంప్యూటర్ లు,  క్రీడా సౌకర్యాలు వంటి మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో కల్పిస్తామన్నారు. విద్యార్థులు క్లాసులు ప్రారంభం నుండే భవిష్యత్తు ప్రణాళికలు గురించి ఆలోచించకుండా, సబ్జెక్టులపై  దృష్టి కేంద్రీకరించి పూర్తి స్థాయిలో ప్రావీణ్యం సంపాదించాలన్నారు. విద్యను అభ్యసించేవారిలో ఆన్ని కులాలు, మతాలు, గొప్పవారు, పేదవారు ఉంటారని, వారు తమ అంతస్థుల తో పోటీ పడకుండా విద్యాభివృద్ధిలో విద్యార్థులు పోటీ పడాలన్నారు.  
 
 
ప్రతి విద్యార్థి నాణ్యమైన విద్య నేర్చుకునే శక్తిని పెంపొందించకోడానికి మంచి మానసిక, శారీరక ఆరోగ్యం కలిగి ఉండాలన్నారు. ఇంగ్లీషు భాషలో ప్రావీణ్యం సంపాదించేందుకు ఆంగ్ల దినపత్రికలను ప్రతీరోజు చదువుతూ ఉండాలన్నారు.  యువత తమ ప్రతిభను దేశ ప్రయోజనాలకోసం వినియోగించాలన్నారు. ఆచార్య కెసి రెడ్డి ఛాన్స్లర్ ఆర్జీయూకేటీ ఏపీ మాట్లాడుతూ ఆర్జీయూకేటీతో తనకు ఉన్నటువంటి సంబంధాన్ని విద్యార్థుల తల్లిదండ్రులతో పంచుకున్నారు. ఆర్జీయూకేటీ విద్యార్థులకి నాణ్యమైన విద్యను అందిస్తుందని, ఇక్కడ చదువు చెప్పే ఉపాధ్యాయులు అందరూ బాగా అర్హత సాధించిన వారని వివ‌రించారు. విద్యార్ధులు ఏ ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా చదువుకోవాలని, ఏవైనా సమస్యలు ఉంటే తమకు వాట్సాప్ ద్వారా కానీ, మెయిల్స్ ద్వాకా కాని తెలిపి పరిష్కరించుకోవచ్చని తెలియజేశారు. 
 
కార్యక్రమంలో ఆచార్య హేమచంద్రారెడ్డి వైస్ ఛాన్స్ ల‌ర్ ఆర్జీయూకేటీ ఏపీ, నూజివీడు ట్రిపుల్ ఐటి డైరెక్టరు జివిఆర్ శ్రీనివాసరావు, ఆర్.కె.వ్యాలీ ట్రిపుల్ ఐటీ డైరెక్టరు జయరాం రెడ్డి, ట్రిపుల్ ఐటి అడ్మిషన్స్ కన్వీనర్ ఆచార్య గోపాలరాజు, అద్యాపకులు, తల్లిదండ్రులు, ట్రిపుల్ ఐటి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మార్చి 2022 నాటికి 7లక్షల మంది చనిపోతారు.. ఎందుకంటే?