Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దేవరపల్లి-కొవ్వూరులో మోటార్ బైక్ రోడ్డుపై పార్క్ చేస్తే ఇక కనబడదు, అంతే...

దేవరపల్లి-కొవ్వూరులో మోటార్ బైక్ రోడ్డుపై పార్క్ చేస్తే ఇక కనబడదు, అంతే...
, మంగళవారం, 3 ఆగస్టు 2021 (20:52 IST)
అంతర రాష్ట్ర మరియు పలు జిల్లాలలో మోటార్ సైకిల్ దొంగతనాలు చేసిన ఇద్దరు ఘరానా కేటుగాళ్ళను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 109 మోటర్ సైకిల్ లను ( వాటి యొక్క విలువ 55 లక్షలు రూపాయలు) స్వాధీనము చేసుకొన్నారు దేవరపల్లి పోలీసు స్టేషన్ సిబ్బంది.
 
పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ దేవ్ శర్మ ఐపీఎస్ వారి యొక్క ఆదేశాలపై కొవ్వూరు డీఎస్పీ శ్రీ శ్రీనాద్ గారి ఆధ్వర్యంలో దేవరపల్లి ఎస్ఐ శ్రీ కె.హరిరావు గారు మరియు వారి యొక్క సిబ్బందితో దేవరపల్లి మరియు కొవ్వూరు ప్రాంతాలలో పలు మోటార్సైకిల్ దొంగతనాల దర్యాప్తులో భాగంగా ప్రత్యేకముగా మోటార్ సైకిల్ దొంగతనాలపై స్పెషల్ టీంలను ఏర్పాటు చేసి దర్యాప్తును కొనసాగించారు.

ఈ క్రమంలో నిన్న అనగా 02.08.2021వ తేది నాడు దేవరపల్లి ఎస్ఐ గారు వారి యొక్క సిబ్బందితో దేవరపల్లిలో వాహన తనిఖీలు నిర్వహించుచుండగా ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్ పైన వచ్చుచుండగా పోలీస్ వారిని చూచి వారు పారిపోవుటకు ప్రయత్నించారు.

ఎస్ఐ గారు వారి యొక్క సిబ్బంది సదరు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేయగా సదరు ఇద్దరు వ్యక్తులు 109 మోటార్ సైకిళ్ళు లను దొంగతనము చేసినట్లుగా అంగీకరించారు. సదరు మోటార్ సైకిళ్ళు దాచిన ప్రదేశములో ఉన్న మోటార్ సైకిళ్ళను పోలీస్ వారికి చూపించినట్లు సదరు మోటర్ సైకిల్ లు స్వాధీనము చేసుకొని ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా 83 మోటార్ సైకళ్లు ఏలూరు, భీమడోలు, తడికలపూడి, జంగాగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, టి. నరసాపురం, దేవరాపల్లి, కొవ్వూరు, నిడదవోలు, చాగల్లు, తాడేపల్లిగూడెం మరియు ద్వారకా తిరుమల, రాజమహేంద్ర వరం.

తూర్పు గోదావరి జిల్లా మరియు తెలంగాణ రాష్ట్ర ము, అశ్వరావు పేటలలో పోలీసు స్టేషన్లలో కేసులు నమోదు పర్చినట్లు, మిగిలిన 26 వాహనాల యొక్క యజమానులు యొక్క వివరాలు తెలియవలసి ఉన్నట్లు  సదరు ఇద్దరు నిందుతుల పై  దేవరపల్లి పోలీసు స్టేషన్ లో కేసును నమోదు పర్చినారు.
 
వాహనాల యొక్క వివరములు 
హోండా ఫేషన్ = 18
హోండా గ్లామర్  = 12
హీరో స్ప్లెండర్ – 23
హోండా శైన్ 07
హీరో హెచ్‌ఎఫ్ డెలాక్స్ =29
బజాజ్ పల్సోర్  = 01 
హోండా యునికాన్ = 01
ఎఫ్‌జెడ్ = 01
టి‌వి‌ఎస్ ఎక్స్‌ఎల్ మోపెడ్ -17  
మొత్తము 109 మోటార్ సైకళ్లు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప‌నిలేని చంద్ర‌బాబు ఎలాగైనా రావాాలని ఎత్తులు వేస్తున్నారు: సజ్జల