Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నేను ఒంటరిగా కారులో తిరుగుతున్నా, నన్ను నరికేసినా నరికేస్తారు: వైఎస్ సునీత- Video

Advertiesment
Sunitha-Sharmila

ఐవీఆర్

, శనివారం, 6 ఏప్రియల్ 2024 (15:27 IST)
కర్టెసి-ట్విట్టర్
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల నిన్నటి నుంచి ఎన్నికల పర్యటన ప్రారంభించారు. ఆమెతోపాటు ఆమె చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత కూడా పర్యటనలో పాల్గొంటున్నారు. కడప లోక్ సభ స్థానం నుంచి తన చిన్నాన్నను హత్య చేసినవారికి తన సోదరుడు జగన్ టిక్కెట్ ఇచ్చాడనీ, హంతకుడు చట్టసభల్లో అడుగుపెట్టకూడదు కనుక అక్కడి నుంచి తను పోటీ చేస్తున్నట్లు చెప్పారు వైఎస్ షర్మిల.
 
షర్మిల మాటల్లోనే... ''బాబాయిని చంపిన హంతుడుకి మళ్లీ సీట్ ఇచ్చారు. హంతకులను కాపాడుతున్నారు. ఇది దురదృష్టం, దుర్మార్గం. ఇది అన్యాయం' .. హంతకులు మళ్లీ చట్టసభలోకి వెళ్లరాదు. అందుకే మీ వైఎస్సార్ బిడ్డ కడప ఎంపీగా పోటీ చేస్తుంది. న్యాయం ఒక వైపు, అధికారం ఒక వైపు. అధర్మం వైపు నిలబడ్డ అవినాష్ రెడ్డి కావాలా? న్యాయం వైపు నిలబడ్డ మీ వైఎస్ షర్మిల కావాలా? ప్రజలు నిర్ణయం తీసుకోవాలి. హత్యా రాజకీయాలు చేసే అవినాష్ రెడ్డిని, కాపాడే జగన్ రెడ్డిని ఇద్దరినీ ఓడించాలి. వైఎస్సార్ బిడ్డను నేను.. వైఎస్సార్ ఎలా ప్రజలకు అందుబాటులో ఉండేవారో.. నేను అలాగే ఉంట.. వైఎస్సార్‌లా సేవ చేసే భాగ్యం కల్పించాలని కోరుకుంటున్నా." అని అన్నారు.
 
ఇదిలావుంటే వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత మాట్లాడుతూ... తన వెనుక ఏ పార్టీ లేదని అన్నారు. కేవలం తన తండ్రికి జరిగిన అన్యాయానికి న్యాయం కావాలని తను పోరాటం చేస్తున్నట్లు చెప్పారు. నేను ఎవరిమీదా పగ సాధించాలని అనుకోవడంలేదు. అలా అనుకుంటే నేను కూడా కత్తులు, కటార్లు తీసుకుని నా తండ్రిని హత్య చేసినవారిని అంతమొందించగలను. కానీ నేను అలా అనుకోవడంలేదు. హత్య చేసిన దోషులను శిక్షించాలని న్యాయం కోసం పోరాడుతున్నాను. ఈ పోరాటం కోసం నేను ఒంటరిగా తిరుగుతున్నాను. ఇలాంటి సమయంలో ఎవరైనా నాపై దాడి చేసినా పట్టించుకునేదెవరు... నన్ను నరికేసినా నరికేస్తారు అంటూ చెప్పారు సునీత.


Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సికింద్రాబాద్ కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీగణేష్