Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అలా చేయకుంటే జగన్, విజయసాయికి బలమైన సమాధి: హమ్మ సీపీఐ రామకృష్ణ ఎంత మాట అనేశాడు

Advertiesment
అలా చేయకుంటే జగన్, విజయసాయికి బలమైన సమాధి: హమ్మ సీపీఐ రామకృష్ణ ఎంత మాట అనేశాడు
, శుక్రవారం, 26 ఫిబ్రవరి 2021 (07:55 IST)
స్టీల్‌ప్లాంట్‌  ప్రైవేటు చేతుల్లోకి వెళ్లకుండా సీఎం జగన్‌, ఎంపీ విజయసాయిరెడ్డి ఆపగలరని, ఒకవేళ దాన్ని ఆపకపోతే వైసీపీకి అరుంధతి చిత్రంలో విలన్‌కు కట్టిన సమాధి కంటే బలమైన సమాధిని ప్రజలే కడతారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ హెచ్చరించారు.

‘‘ప్రభుత్వరంగ సంస్థలు నడపలేమని, వాటిని ప్రైవేటుకు అప్పగిస్తామని ప్రధాని మోదీ బహిరంగంగా ప్రకటించారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుకు అప్పగించడానికి కేంద్రం కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు వార్తలొచ్చాయి.

ఇంత జరుగుతున్నా బీజేపీ రాష్ట్ర నేతలు ఏమీ జరగడం లేదన్నట్టు ప్రగల్భాలు పలుకుతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎంపీ జీవీఎల్‌ నరసింహరావుకు ఏమాత్రం సిగ్గున్నా తక్షణం ఆ పార్టీకి రాజీనామా చేయాలి’’ అని డిమాండ్‌చేశారు. ఇక్కడి బీజేపీ నేతలకు ప్రధాని కనీసం అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేడు భారత్ బంద్ : పెట్రో బాదుడుకు నిరసనగా...