Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Kodali Nani: నా చిన్నప్పటి నుంచి బిజెపి పార్టీని చూస్తున్నా.. ఏం లాభం? నోటా ఓట్లను కూడా దాటలేదు

Advertiesment
Kodali Nani: నా చిన్నప్పటి నుంచి బిజెపి పార్టీని చూస్తున్నా.. ఏం లాభం? నోటా ఓట్లను కూడా దాటలేదు
, శుక్రవారం, 8 జనవరి 2021 (19:13 IST)
విమర్శలపై తనదైన శైలిలో స్పందించారు మంత్రి కొడాలి నాని. ఎంపిగా ఉన్న జివిఎల్ ఎప్పుడైనా హోంమంత్రి అమిత్ షాను కలవవచ్చని అందులో తమకు అభ్యంతరమే లేదని వ్యాఖ్యానించారు. తన చిన్నప్పటి నుంచి బిజెపి ఉందని సెటైర్ వేశారు. 
 
నాపై ఫిర్యాదు చేసేందుకు హోంమంత్రిని కలివడానికి జివిఎల్ వెళతానంటున్నారు. వెళ్లనీయండి.. ఆయన పార్టీ... ఆ పార్టీకి చెందిన మంత్రి... వారు చూసుకుంటారు. బిజెపికి దేశంలో బలం ఉంటే ఉండనీయండి.. వైఎస్ఆర్‌సిపికి ఎపిలో కావాల్సినంత బలం ఉంది.
 
నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా గత ఎన్నికల్లో బిజెపికి రాలేదు. అది పరిస్థితి. కాబట్టి బిజెపి గురించి, ఆ పార్టీ నేతల గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదంటూ కొడాలి నాని జివిఎల్ వ్యాఖ్యలను తోసిపారేశారు. జనాదరణ కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అయితే.. బలమున్న పార్టీ వైఎస్ఆర్‌సిపి అంటూ చెప్పుకొచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఔరంగాబాద్: ఈ నగరం పేరుమార్చడంపై వివాదం ఎందుకు? హైదరాబాద్‌‌తో సంబంధమేమిటి?