Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వైయస్ మాకు చెప్పిన మాట ఇప్పుడు మీకు చెబుతున్నా జగన్: శైలజానాథ్

వైయస్ మాకు చెప్పిన మాట ఇప్పుడు మీకు చెబుతున్నా జగన్: శైలజానాథ్
, బుధవారం, 20 అక్టోబరు 2021 (18:08 IST)
ఎపి ప్రభుత్వానికి,  సిఎం జగన్మోహన్ రెడ్డి కి మంచి మాటలు చెప్పాల్సిన అవసరం ఉంది అని ఏపీ పిసిసి చీఫ్ శైలజానాథ్ అన్నారు. ఆయన మాట్లాడుతూ... జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం గురించి ఆలోచించడం లేదు.
 
ప్రభుత్వం నిజంగా పని చేస్తే  రాష్ట్రం ఇలా తయారయ్యేది కాదు. మీ గూఢచారులు, ఆంతరంగికులు ఏం చెబుతున్నారో తెలుసుకోండి. రాష్ట్రం పూర్తి గా దివాళా తీసింది... అప్పు చేయకుండా జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. నవరత్నాలు పధకాలకు కూడా డబ్బు లేకుండా ఖజానా ఖాళీ చేశారు.
 
మీరు పెయింట్లు వేసి... అ రంగులతోనే ఆనందపడుతున్నారు. మీ అన్న మోడి..  అందరికీ ఆ రంగులు చూపించి మాయ చేస్తారు. సిఎం తర్వాత ఒక సూపర్ మంత్రి వచ్చి మాట్లాడతారు. అన్నీ ఆయనే చెబుతారు... ఎక్కడ ఏం జరిగినా ఆయనే  స్పందిస్తారు. మీ మంత్రులు అందరూ ఉత్సవ విగ్రహాలుగా మార్చారు.
 
వారిని చూసి జాలి పడటం తప్ప చేసేదేమీ ఉండదు. రాష్ట్రంలో మెడికల్ మాఫియా పెరిగిపోయింది. మీ మెడికల్ డిపార్ట్మెంట్ ఏం‌చేస్తుందో కూడా చెప్పలేరు. వాలంటీర్లు, సచివాలయం ఉద్యోగాలు తప్ప ..‌ మీరు చేసిందేమీ లేదు.
 
అందరికీ రంగులు కొట్టాం... ఆ మాయలోనే ప్రజలు ఉండాలని అనుకుంటున్నారు. కృష్ణానదిని కూడా వదలకుండా మీ వాళ్లు ఆక్రమణ చేస్తున్నారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు. సిఎంని ఎవరేమన్నా...‌ టిడిపి వారికి పట్టిన గతే పడుతుందని ఓ ఎమ్మెల్యే హెచ్చరిస్తారు.
 
అంటే.... మేము మీ తప్పులను ఎత్తి చూపకూడదా... కీర్తిస్తూ ఉండాలా? ఇది ఆరంభం అంటున్నారు.... మరి ముగింపు ఎలా ఉంటుందో? ఇప్పుడు మాట్లాడుతున్న భాష గురించి మీరు మాట్లాడితే ఎలా? నీ తండ్రి అని చెప్పడానికి... తల్లి పేరును వాడేవాడు... మీ మంత్రి. ఇలాంటి భాష గతంలో ఎప్పుడూ మేము చూడలేదు.
 
హోం మంత్రి సుచరిత కూడా భాషను అదుపులో ఉంచుకోవాలి. వైయస్ మాకు చెప్పిన మాట ఇప్పుడు మీకు చెబుతున్నా. ఇటు, అటు అవడం రాజకీయాల్లో సహజం... శాశ్వత శత్రువులు ఉండరు. ప్రభుత్వ అధినేతగా... విలువలతో శాసన సభను నడిపేలా చూడాలి. రాజకీయాలలో ఆరోపణలు, విమర్శలు సహజమనే వాస్తవం జగన్ గుర్తించాలి.
 
రాజకీయాలలో ప్రతీకారాలకు, దౌర్జన్యాలకు, హింసకు తావుండకూడదు. ఇప్పుడు అయినా జగన్ కళ్లు తెరచి చూడాలని కోరుతున్నా. రాజ్యంగబద్దంగా ... చట్టపరంగా దోషులను శిక్షించాలని డిజిపిని కోరుతున్నాం. బిజెపికి అంత లొంగి బతకాల్సిన అవసరం లేదు.
 
ప్రజలకు, రాష్ట్రానికి మేలు జరిగేలా జగన్ పాలించాలి. మీ సలహాదారులు అందరనీ తీసేస్తే... ఆ డబ్బుతో పధకం అమలు చేయవచ్చు. మీ సలహాదారుల పేర్లు, హోదా చెబితే కాంగ్రెస్ పార్టీ తరపున కానుక ఇస్తాం అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామికి 6 కేజీల బంగారం ఇస్తున్న ఎం.ఇ.ఐ.ఎల్