Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అద్దంకిలో హైడ్రామా..ఏమైందో తెలుసా?

అద్దంకిలో హైడ్రామా..ఏమైందో తెలుసా?
, గురువారం, 4 మార్చి 2021 (09:28 IST)
అద్దంకి నగర పంచాయతీ ఎన్నికల రాజకీయం రసవత్తరంగా మారింది. ప్రధాన పార్టీల నేతలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. దీంతో 8వ వార్డులో వైసీపీ, టీడీపీ తరపున నామినేషన్లు వే సిన నలుగురూ ఉపసంహరించుకున్నారు.

టీడీపీకి చెందిన ఇద్దరు మంగళవారం పోటీ నుంచి తప్పుకోగా, వైసీపీ నుంచి నామినేషన్‌ వేసిన ఇద్దరూ బుధవారం వైదొలిగారు. ఈ సందర్భంగా పెద్ద హైడ్రామానే నడిచింది. నగర పంచాయతీలోని 8వ వార్డు ఎస్టీ జనరల్‌కు రిజర్వు కాగా టీడీపీ నుంచి కత్తి కామయ్య, ఇండ్లా కోటేశ్వరరావు.. వైసీపీ నుంచి  బొజ్జా వెంకటేశ్వర్లు, బొజ్జా పరశురామ్‌ నామినేషన్లు దాఖలు చేశారు.

గత ఏడాది నామినేషన్ల సమయంలో టీడీపీ ప క్షాన ఉన్న నర్రావారిపాలెంకు చెందిన పలువురు నే తలు మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో వై సీపీ పంచన చేరారు. ఈ ప్రభావం 8వ వార్డు నుంచి నామినేషన్లు వేసిన వారిపై పడింది. దీంతో ఎన్నికల ప్రక్రియ పునఃప్రారంభమైన వెంటనే వైసీపీ నేతలు 8వ వార్డుపై దృష్టి సారించారు.

ఆ తర్వాత ఇరు పా ర్టీల నుంచి నామినేషన్లు వేసిన నలుగురు అభ్యర్థులు అదృశ్యమయ్యారు. వీరిలో టీడీపీ తరఫున నామినేష న్లు వేసిన ఇద్దరితోపాటు, తమ పార్టీ నుంచి పోటీలో ఉన్న వారిలో ఒకరైన వెంకటేశ్వర్లును వైసీపీ నాయకు లు తమ ఆధీనంలో ఉంచుకున్నారు.

దీన్ని గుర్తించిన టీడీపీ నేతలు వైసీపీ నుంచి బరిలో ఉన్న పరశు రామ్‌ను తమ అదుపులోకి  తీసుకున్నారు. ఇలా నలుగురు అభ్యర్థులను గత 10 రోజుల నుంచి దూరంగా ఉంచారు. ఉపసంహరణల తొలిరోజైన మంగళవారం వైసీపీ నాయకులు తమ చెంత ఉన్న ఇద్దరు టీడీపీ అభ్యర్థులు కత్తి కామయ్య, ఇండ్లా కోటేశ్వరరావులను తీసుకొని వచ్చి నామినేషన్లను ఉపసంహరింపచేశారు.

తమ పార్టీ తరఫున పోటీ చేసిన బొజ్జా వెంకటేశ్వర్లు చేత బుధవారం ఉపసంహరింపచేసిన వైసీపీ నాయ కులు టీడీపీ నేతల వద్ద ఉన్న  బొజ్జా పరశురామ్‌ పేరుతో పార్టీ బీఫాం ఇచ్చారు. దీంతో వైసీపీ తరఫున ఆయన ఎన్నిక ఏకగ్రీవం అవుతుందని ఆ పార్టీ నా యకులు భావించారు.

నామినేషన్ల ఉపసంహరణ ముగిసే సమయానికి కొద్దిగా ముందు పరశురామ్‌ను ఎమ్మెల్యే రవికుమార్‌ నగర పంచాయతీ కార్యాలయం వద్దకు తీసుకువచ్చారు. ఆయన బయట ఉండి పరశు రామ్‌ను లోపలికి పంపారు.

చివరి నిమిషంలో అధికా రుల వద్దకు వెళ్లిన పరశురామ్‌ తన నామినేషన్‌ను ఉ పసంహరించుకున్నారు. 8వ వార్డులో ఒక్కరు కూడా పోటీలో లేకపోవడంతో అక్కడ ఎన్నికకు బ్రేక్‌ పడింది. మిగిలిన  19 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బలవంతపు ఏకగ్రీవాలపై ఎస్‌ఈసీ సీరియస్‌