Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తరగతి గది బెంచి కింద కొండచిలువ...

అటవీ ప్రాంతాల్లో ఉండాల్సిన విషపు సర్పాలు, కొండచిలువలు ఇపుడు ఏకంగా జనావాస ప్రాంతాల్లోకి వస్తున్న సంఘటనలు అనేకం చూస్తున్నాం. తాజాగా మెదక్ జిల్లాలోని ఓ పాఠశాల తరగతి గదిలోని బెంచి కింద పెద్ద కొండచిలువ దర్

తరగతి గది బెంచి కింద కొండచిలువ...
, మంగళవారం, 1 ఆగస్టు 2017 (08:54 IST)
అటవీ ప్రాంతాల్లో ఉండాల్సిన విషపు సర్పాలు, కొండచిలువలు ఇపుడు ఏకంగా జనావాస ప్రాంతాల్లోకి వస్తున్న సంఘటనలు అనేకం చూస్తున్నాం. తాజాగా మెదక్ జిల్లాలోని ఓ పాఠశాల తరగతి గదిలోని బెంచి కింద పెద్ద కొండచిలువ దర్శనమిచ్చింది. దీన్ని చూసిన విద్యార్థులు ప్రాణభయంతో తల్లడిల్లిపోయారు. 
 
మెదక్ జిల్లా మద్దుల్వాయి గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉంది. ఇందులోని ఓ తరగతి గదిలోని ఓ బెంచిని జరిపేందుకు విద్యార్థులు ప్రయత్నించగా అది జరగలేదు. దీంతో విద్యార్థులు బెంచి కింద తొంగిచూడగా, అక్కడ పెద్ద కొండచిలువ కనిపించింది. దీంతో పెద్దగా కేకలు వేస్తూ తరగతి గది నుంచి పరుగులు తీశారు. 
 
ఆ తర్వాత ఉపాధ్యాయులు రంగప్రవేశం చేసి తరగతి గదిలోకి పొగ పెట్టి దాన్ని చంపేశారు. మద్దుల్వాయి ప్రభుత్వ పాఠశాల ఆవరణలోకి తరచూ పాములు రావడం సర్వసాధారణమని కానీ ఈ సారి ఏకంగా కొండచిలువ తరగతి గదిలోకి వచ్చిందని ఉపాధ్యాయులు చెప్పారు. తమ పాఠశాలలోకి పాములు, కొండచిలువలు రాకుండా ప్రహరీగోడ నిర్మించాలని విద్యార్థులు కోరుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సర్కారీ బడి స్టూడెంట్‌కు గూగుల్ జాబ్... ఊహించని ప్యాకేజీ...