Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

18 నెలల ఆడ శిశువు ఫస్ట్ ఫ్లోర్ నుంచి జారి పడిందా? తోసేశారా? వీడియో వైరల్.. పరిస్థితి విషమం

ఆదివారం పూట హైదరాబాదులోని ఓ మూడంతస్తుల భవనంలో ఓ 18 నెలల బిడ్డను కిందకు విసిరేసిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మొదటి అంతస్తు నుంచి ఆ బిడ్డను కిందకి విసిరేయడంతో ఆ బిడ్డ తలకు బలంగా గాయమైన

Advertiesment
18 నెలల ఆడ శిశువు ఫస్ట్ ఫ్లోర్ నుంచి జారి పడిందా? తోసేశారా? వీడియో వైరల్.. పరిస్థితి విషమం
, మంగళవారం, 13 జూన్ 2017 (18:37 IST)
ఆదివారం పూట హైదరాబాదులోని ఓ మూడంతస్తుల భవనంలో ఓ 18 నెలల బిడ్డను కిందకు విసిరేసిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మొదటి అంతస్తు నుంచి ఆ బిడ్డను కిందకి విసిరేయడంతో ఆ బిడ్డ తలకు బలంగా గాయమైనట్లు తెలుస్తోంది. బిడ్డ కింద పడిన వెంటనే ఓ వ్యక్తి ఆ బిడ్డను అలానే లేవనెత్తుకున్నాడు. ఈ  దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో కనిపిస్తున్నాయి. 
 
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైర్ అయ్యింది. ప్రస్తుతం ఆ 18నెలల ఆడ శిశువుకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
 
మొదటి అంతస్తు నుంచి ఆ బిడ్డ ప్రమాదవశాత్తూ కిందపడిందని పోలీసులు చెప్తున్నారు. బహదూర్పురా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. మొదటి అంతస్తు నుంచి ఆడుకుంటున్న బిడ్డ జారిపడిందని.. ఆ సమయంలో ఆ ఇంట్లో వున్నవారంతా నిద్రపోతున్నారని.. అప్పుడే నిద్రలేచిన బిడ్డ ఆడుకుంటూ.. బాల్కనీ నుంచి జారిపడిందని పోలీసులు చెప్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డాడీ తాత దగ్గరకు వెళ్తే.. మనం కూడా డాడీ దగ్గరకు వెళ్ళిపోదాం.. అదే చివరి సెల్ఫీ