Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డాడీ తాత దగ్గరకు వెళ్తే.. మనం కూడా డాడీ దగ్గరకు వెళ్ళిపోదాం.. అదే చివరి సెల్ఫీ

కర్నూలు జిల్లాలో సంభవించిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ ఆటోడ్రైవర్ కన్నుమూశాడు. ఈ ఘటనపై ఆటోడ్రైవర్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె ఆశ్రిత ఏడుపును ఎవ్వరూ ఆపలేకపోయారు. రాజశేఖర్ రెడ్డికి కూతురంటే ప్రాణం. అలాంటి చిట్ట

Advertiesment
Auto driver
, మంగళవారం, 13 జూన్ 2017 (16:58 IST)
కర్నూలు జిల్లాలో సంభవించిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ ఆటోడ్రైవర్ కన్నుమూశాడు. ఈ ఘటనపై ఆటోడ్రైవర్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె ఆశ్రిత ఏడుపును ఎవ్వరూ ఆపలేకపోయారు. రాజశేఖర్ రెడ్డికి కూతురంటే ప్రాణం. అలాంటి చిట్టి తల్లి తండ్రి ఇక రారన్న విషయం తెలుసుకుని ఆస్పత్రిలో రోదించిన విధానం చూసి అందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. కర్నూలు జిల్లా రాజశేఖర్‌రెడ్డి మంగళవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. 
 
ఈ విషయం తెలుసుకున్న భార్య సుష్మ అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. తండ్రి చనిపోయాడనుకుని తెలుసుకున్న ఆశ్రిత ఏడుపును ఆపడం ఎవరితరం కాలేదు. నాన్న కావాలంటూ మృతదేహం వద్దకు వెళ్లే  ప్రయత్నం చేసిన తీరు అక్కడి వారిని కంటతడి పెట్టింది. డాడీ తాతదగ్గరకు వెళ్లారని చెప్తే.. మనం కూడా డాడీ దగ్గరకు వెళ్ళిపోదామని రోదించింది. డాడీ సోమవారం మధ్యాహ్నం తాను చెప్పిన మాట వినకుండా వెళ్ళిపోయాడని.. ఇకనైనా నువ్వైనా బయటకు వెళ్ళొద్దమ్మా అంటూ తల్లితో చెప్పింది.
 
రాజశేఖర్‌రెడ్డి స్థానికంగా ఆటో డ్రైవర్‌గా జీవనం చేస్తూ మరోవైపు వ్యవసాయం చూసుకునేవాడు. ఆదివారం మధ్యాహ్నం కూతురితో సెల్ఫీ దిగి ఆ ఫోటోను వాట్సాప్ ప్రొఫైల్‌గా పెట్టుకున్నాడు. అదే ఆ తండ్రీకూతురికి చివరి సెల్ఫీగా మిగిలిపోయింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తమిళనాడులో హత్యా రాజకీయాలు... ఎవర్ని ఎప్పుడు చంపుతారో...?!