Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భర్త మర్మాంగంపై తన్నిన భార్య.. ఏమైందంటే?

Advertiesment
Husband Suspicious Death in Chittoor Dist
, బుధవారం, 11 ఆగస్టు 2021 (20:17 IST)
ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన కేశవ, రేఖకు కొన్నేళ్ల క్రితం పెళ్లైంది. వీరి కాపురం తొలుత సజావుగానే సాగింది. కానీ ఆర్ధిక ఇబ్బందులు, ఇతర సమస్యల కారణంగా కేశవ మద్యానికి బానిసయ్యాడు. పలమనేరు టమాటా మార్కెట్లో హమాలిగా పనిచేసే కేశవ వచ్చిన డబ్బంతా మద్యానికి తగలేస్తుండేవాడు. అనంతరం ఇంటికొచ్చి భార్యతో గొడవపడుతుండేవాడు. దీంతో ఇద్దరి మధ్య తరచూ ఘర్షణ జరిగేది. 
 
ఈ క్రమంలో ఈ ఏడాది మే 23వ తేదీన ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఇద్దరూ ఇంటి మేడపైకి ఎక్కి గొడవ పడుతున్నారు. ఈ క్రమంలో కేశవ.. రేఖను దూషించాడు. అక్కడితో ఆగకుండా ఆమెను కొట్టాడు. భర్త చేసిన పనికి కోపోద్రిక్తురాలైన రేఖ ఒక్కసారిగా అతడి మర్మాంగంపై కాలితో తన్నింది. 
 
ఆవేశంలో పలుసార్లు తన్నడంతో నొప్పి భరించలేక మేడపై నుంచి కిందపడి మృతి చెందాడు. దీంతో తన భర్త మద్యం మత్తులో మేడపై నుంచి కిందపడిపోయాడని అందర్నీ నమ్మించింది. ఐతే కేశవ తల్లి మాత్రం తన కొడుకు ప్రమాదవశాత్తూ చనిపోలేదని హత్య చేశారని అనుమానం వ్యక్తం చేసింది. దీంతో అనుమాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సిఎం జ‌గ‌న్‌ని క‌లిసి అభినందించిన‌ ఎమ్మెల్సీ క‌రీమున్నీసా