తాను ఎంతగానో ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న భార్య డెంగీ జ్వరంతో చనిపోయింది. ఆ తర్వాత భర్త వెంకట రమణ చిన్నపాటి ఉద్యోగం చేస్తూ తన ఇద్దరు పిల్లల ఆలనాపాలన చూసుకుంటున్నారు. అయితే, తన భార్య చనిపోయే ముందు.. బావా.. నీవు టీచర్ ఉద్యోగం సంపాదించుకోవాలి అంటూ వ్యాఖ్యానించింది.
భార్య చనిపోయిన తర్వాత ఆ భర్త.. భార్య కోరిక తీర్చేందుకు నడుంబిగించారు. తన కుటుంబ కష్టాల్లోనూ తనను ఉపాధ్యాయుడిగా చూడాలనుకున్న అర్ధాంగి కోరికను తీర్చాలని సంకల్పించుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం రెడ్డికుంటకు చెందిన రామకృష్ణ.... మెగా డీఎస్సీ ప్రకటన వచ్చిందే తడవుగా పట్టుదలతో చదివారు.
రోజుకు 17 గంటలు కష్టపడ్డారు. 70.02 మార్కులతో బీసీ-డీ రిజర్వేషన్ కోటాలో స్కూల్ అసిస్టెంట్ (బయాలజీ)గా ఎంపికయ్యారు. తన విజయాన్ని భార్యకు అంకితం చేశారు. 'నా భార్య కోరికను నెరవేర్చడం సంతోషాన్ని కలిగిస్తోంది. ఆమె బతికి ఉంటే ఎంతో సంబరపడేది' అని రామకృష్ణ కంటనీరు పెట్టుకున్నారు.