Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీలో వందలాది దేవాలయాలు ధ్వంసం చేస్తున్నా పట్టదా?: కమలానంద భారతి స్వామి

ఏపీలో వందలాది దేవాలయాలు ధ్వంసం చేస్తున్నా పట్టదా?: కమలానంద భారతి స్వామి
, గురువారం, 4 ఫిబ్రవరి 2021 (13:41 IST)
ఏపీలో దేవాదాయ శాఖ పనితీరుపై భువనేశ్వరిపీఠం కమాలానంద భారతి స్వామి అసంతృప్తి వ్యక్తం చేశారు. సనాతన ధర్మ పరిరక్షణ సదస్సు వివరాలను కమలానంద భారతి స్వామి, పుష్పగిరి పీఠం స్వామి విద్యాశంకర భారతి స్వామి మీడియాకు వివరించారు.
 
ఏపీలో ఆలయాలపై జరుగుతున్న దాడులను పట్టించుకోవడం లేదని ఆవేదన చెందారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం తిరుపతిలో  కంచి కామకోటి జగద్గురువు శంకర పీఠాధీశ్వరులు విజయేంద్ర సరస్వతి మహా స్వామి ఆధ్వర్యంలో మహాసభ నిర్వహిస్తామని తెలిపారు. ఏపీలో ఆలయాలు హిందూ ధర్మంపై జరుగుతున్న దాడులపై చర్చించామని తెలిపారు.
 
గత టీడీపీ ప్రభుత్వంలో పుష్కరాలు సమయంలో ఆలయాలు ధ్వంసం చేశారని గుర్తుచేశారు. గత కొన్ని నెలలుగా ఏపీలో వందలాది ఆలయాలను ధ్వంసం చేశారని.. రామతీర్థంలో రాముడు తల ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధన విరుద్ధంగా హిందూ దేవాలయాల వద్ద అన్యమత ప్రచారం జోరుగా జరుగుతోందని స్వామీజీ తెలిపారు. మైనారిటీ మెప్పు కోసం హిందూ దేవాలయాల ఆదాయన్ని వినియోగిస్తున్నారని ఆరోపించారు.
 
హిందూ మతాన్ని మట్టుపెట్టే కార్యక్రమాలను ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తిరుమల నుండి శ్రీశైలం వరకు అపచారాలు జరుగుతున్న పట్టించుకోకుండా ఉన్నారని  కమలానంద భారతీ స్వామి మండిపడ్డారు. 
 
పుష్పగిరి పీఠాధీశ్వరులు విద్యాశంకర భారతి మహాస్వామి మాట్లాడుతూ... ఏపీలో దేవాదాయ శాఖ పనితీరు బాగలేదని విమర్శించారు. అన్యుల పెత్తనం పెరిగిందన్నారు.
 
ఆలయాల ఆదాయాన్ని సెక్యులర్ సంక్షేమ పధకాలకు ఒక్క పైసా ఖర్చు చేయకూడదని... ఆలయాల నిధులను ఇతర హిందూ ఆలయాల కోసం ఖర్చు చేయాలన్నారు. రిటైర్డ్ న్యాయమూర్తి, నిపుణులు ద్వారా ఏపీలో జరుగుతున్న దాడులు...నగలు, ఆస్తులను కాపాడేందుకు కమీటి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
 
పురావస్తు శాఖ పరిధిలోని ఆలయాలను పరిరక్షణకు వారితో ప్రభుత్వం చర్చించి ఆలయాల సంరక్షణకు అవకాశం ఇవ్వాలన్నారు. ఆలయాల విషయంలో పురావస్తు నిబంధనల్లో సడలింపులకు ప్రభుత్వం కృషి చేయాలని సూచించారు. త్వరలో సనాతన ధర్మ పరిరక్షణ మహాసభను నిర్వహించబోతున్నామని...వెంటనే ప్రభుత్వం తమ నిర్ణయాలు అమలు చేయాలని కోరుతున్నామని విద్యాశంకర భారతి తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా వ్యాక్సినేషన్‌లో భారత్ సరికొత్త రికార్డు