Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చేలో హ‌ర‌ర్ బొమ్మ ... పంట రక్షణ కోసం యువ రైతు వినూత్నప్రయోగం

చేలో హ‌ర‌ర్ బొమ్మ ... పంట రక్షణ కోసం యువ రైతు వినూత్నప్రయోగం
విజ‌య‌వాడ‌ , శుక్రవారం, 8 అక్టోబరు 2021 (16:47 IST)
పంట‌పై ప‌క్షులు వాలి నాశ‌నం చేస్తున్నాయి. దీని కోసం ఏం చేయాల‌ని ఓ యువ రైతు ఆలోచ‌న చేశాడు... అంతే, ఓ మంచి అయిడియా వ‌చ్చింది. అతి త‌క్కువ ఖ‌ర్చుతో దానిని ఆచ‌ర‌ణలో పెట్టాడు. చూడండి...ఇలా ఓ బొమ్మ పంట‌ను ర‌క్షిస్తోంది. 
 
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం ముత్నూర్ గ్రామానికి చెందిన యువ రైతు ముండే సాయికిరణ్ అటవి జంతువులు, పక్షుల భారి నుండి పంటను కాపాడుకునేందుకు ఈ హర్రర్ బొమ్మను తయారు చేశాడు. దీనికి ఓ సైకిల్ హాండీల్, ఒక డబ్బా, ఒక పైపు , ఒక స్ప్రింగ్ తో జోడించి సైకిల్ హాండీల్, డబ్బాకు ఓ పాత అంగిని తొడిగి... బొమ్మను అమర్చి స్టాండును ఏర్పాటు చేశాడు.

గాలీ వీచినప్పుడల్లా ఈ బొమ్మ తనకు తాను ఇలా అటు ఇటూ ఊగుతుంది. దీంతో వ్యవసాయ క్షేత్రంలో ఉన్న పంటలపై వాలే పక్షులు, అడ‌వి  జంతువులు ఈ బొమ్మ ఊగడం చూసి ఉలిక్కిపడి పంట పొలంలోకి రాకుండా దూరంగా అటు వైపే వెళ్ళి పోతున్నాయి. వ్యవసాయ దారులకు ఈ ఊగే బొమ్మ చాలా ఉపయోగపడుతోంది. దీనికి కేవలం రూ. 900 మాత్రమే ఖర్చు అవుతోందని, ఎవరికైనా ఈ ఊగే బొమ్మ కావాల్సి ఉంటే తాను తయారు చేసి ఇస్తానని యువరైతు సాయికిరణ్ తెలుపుతున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గూడు లేనివారికి రూ.5 లక్షల నగదు : తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి