Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రెండు లక్షలు ఇవ్వకుంటే ఆ కేసు పెడతా.. హనీట్రాప్.. బాధితుడు ఏం చేశాడంటే?

Advertiesment
Honey Trap

సెల్వి

, మంగళవారం, 3 ఫిబ్రవరి 2026 (12:02 IST)
ఎన్టీఆర్ జిల్లాలో హానీ ట్రాప్ మోసం వెలుగులోకి వచ్చింది. ఎన్టీఆర్ జిల్లా, తిరువూరులో ఓ బాధితుడి నుంచి ఓ మహిళ ఉంగరం, రూ.5వేల నగదు కాజేసింది. అంతేగాకుండా.. రూ.2లక్షలు డిమాండ్ చేసిందని వెలుగులోకి వచ్చింది. హనీట్రాప్ మోసాలకు గురైన బాధితులు పరువుపోతుందన్న భయంతో పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెనుకడుగు వేస్తుంటారు. కానీ ఎన్టీఆర్ జిల్లాకు చెందిన బాధితుడు మాత్రం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాలైన మహిళను అరెస్ట్ చేశారు. 
 
వివరాల్లోకి వెళితే.. తంగెళ్లబీడుకు చెందిన కనపర్తి రేణుక అనే మహిళ యువతులను ఆకర్షించేలా అమ్మాయిల ఫొటోలు చూపిస్తూ వ్యక్తులను మాయలో పడేసి డబ్బులు దోచుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో మాధవరావు అనే ఎన్టీఆర్ జిల్లా వ్యక్తిని బుట్టలో వేసుకుంది. 
 
డబ్బులు, బంగారం కాజేసింది కాకుండా.. రెండు లక్షలు డిమాండ్ చేసింది. అలా ఇవ్వకుంటే అత్యాచారం కేసు పెడతానని బెదిరించింది. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ కేసులో రేణుకతో పాటు మరొక వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Gold Silver Rates: కొండెక్కిన బంగారం ధరలు దిగొస్తున్నాయి.. పసిడి ప్రియులు హ్యాపీ