Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మర్మావయవం కొరికేసిన హిజ్రా... టాక్సీ డ్రైవర్ మృతి

ఓ హిజ్రా అత్యంతనీచమైన పనికి పాల్పడింది. తన వద్దకు వచ్చిన ఓ ట్యాక్సీ డ్రైవర్ మర్మావయవాన్ని కొరికేసింది. దీంతో అతను ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు తెలంగాణ జిల్లా వాసి. విజయనగరం జిల్లాలో ఈ దారుణం జరిగింది.

మర్మావయవం కొరికేసిన హిజ్రా... టాక్సీ డ్రైవర్ మృతి
, గురువారం, 23 నవంబరు 2017 (16:08 IST)
ఓ హిజ్రా అత్యంతనీచమైన పనికి పాల్పడింది. తన వద్దకు వచ్చిన ఓ ట్యాక్సీ డ్రైవర్ మర్మావయవాన్ని కొరికేసింది. దీంతో అతను ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు తెలంగాణ జిల్లా వాసి. విజయనగరం జిల్లాలో ఈ దారుణం జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం రేగుబళ్ళ గ్రామానికి చెందిన వన్నాల లక్ష్మణ్ ‌(34) టాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కుటుంబ విభేదాల కారణంగా భార్యాభర్తలు వేర్వేరుగా నివశిస్తున్నారు. దీంతో ట్యాక్సీ నడుపుకుంటూ ఒంటరిగా జీవిస్తోంది. 
 
అయితే, అతనికి కామెర్ల వ్యాధి సోకడంతో పసరు మందుకోసం గతనెల 29వ తేదీన తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం సమీపంలోని వెల్ల గ్రామానికి వెళ్లాడు. మందు తీసుకొని అదేరోజు తిరుగు ప్రయాణమయ్యాడు. బస్సు కోసం బస్టాండులో నిలబడివుండగా, ఓ హిజ్రా పరిచయమైంది. 
 
వారిద్దరూ కలసి బస్టాండుకు సమీపంలో ట్రాక్టర్‌ మెకానిక్‌ షెడ్డు వద్దకు వెళ్లారు. అక్కడ వారిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదుకానీ, అతని మర్మాంగాన్ని హిజ్రా కొరికేయడంతో లక్ష్మణ్ అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్టుగా ఇంటికి వెళ్లిపోయింది. దీనిపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 
 
ఈ విచారణలో తొండంగి మండలం కృష్ణాపురంలోని బర్మా కాలనీకి చెందిన బృతి వీరవెంకట రమణ అలియాస్‌ వరసాల సోనీగా పిలిచే హిజ్రా ఈ దారుణానికి పాల్పడినట్టు తేలింది. దీంతో హత్యకేసుగా నమోదు చేసి రమణ(సోనీ)ని అరెస్టు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిన్నమ్మ వర్గానికి మరో షాక్-ఓపీఎస్, ఈపీఎస్‌కే రెండాకులు