Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మాన్సాస్ ట్రస్ట్ ఈవోకు హైకోర్ట్ అక్షింతలు

Advertiesment
Highcourt
ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చేయాల్సిన పని ఏంటో మీకు తెలియదా అని హైకోర్టు మాన్సాస్ ఈవోకు అక్షింతలు వేసింది. మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ అశోక గజపతి రాజు పిటిషన్ పైన హైకోర్టులో  విచారణ ప్రారంభమైంది.
 
ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తన ఆదేశాలను పాటించడం లేదని అశోకగజపతి పిటిషన్ వేశారు. దీనితో మాన్సాస్ ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పైన హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈఓ పాత్ర ఏమిటి, ఏం చేస్తారో చెప్పాలని నిలదీసింది ఏపీ హైకోర్టు ధర్మాసనం.
 
కోర్టు తీర్పును ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించింది ధర్మాసనం. చైర్మన్ అశోక్ గజపతి రాజు ఆదేశాలను పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. చైర్మన్‌కు లేఖ రాసే ముందు కోర్టు తీర్పును ఎందుకు చూడలేకపోతున్నారంటూ హైకోర్టు ప్రశ్నించింది.
 
ఆడిట్ పేరిట ఎవరో వస్తున్నారని హైకోర్టు దృష్టికి సీనియర్ న్యాయవాది సీతారామమూర్తి న్యాయవాది అశ్విన్ కుమార్ తీసుకొచ్చారు. ఆడిట్‌తో ఈవోకు సంబంధం లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. జిల్లా ఆడిట్ అధికారి మాత్రమే ఆడిట్ చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈవోకు నోటీసులు జారీ చేసిన ఏపీ హైకోర్టు‌ తన విధుల్నిఇక నిర్వహించకపోతే చర్యలు తప్పవని స్పష్టం చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అసోం, మిజోరాంల మధ్య ఘర్షణ: ఆరుగురు పోలీసుల మృతి