Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

క్రికెట్ ఆడిన హైకోర్టు న్యాయమూర్తులు.. ఎక్కడ?

క్రికెట్ ఆడిన హైకోర్టు న్యాయమూర్తులు.. ఎక్కడ?
, శనివారం, 27 ఫిబ్రవరి 2021 (07:55 IST)
ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్స్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొదటి దక్షణ భారత అడ్వకేట్స్ క్రికెట్ టోర్నమెంట్ శుక్రవారం ఘనంగా ప్రారంభమైయ్యాయి. మూలపాడు క్రికెట్ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభించారు.

తొలుత టోర్నమెంట్ లో పాల్గొంటున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, తమిళనాడు, కర్ణాటక ఆటగాళ్ళను పరిచయం చేసుకున్నారు. అనంతరం జస్టిస్ అరూప్ కుమార్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి ఆటగాళ్ళలో ఉత్సాహం నింపారు. క్రీడలతో మానసిక ఉల్లాసంతో పాటు చక్కటి ఆరోగ్యం కలుగుతుందన్నారు.

ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఆటలో ప్రావీణ్యతను కలిగి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. న్యాయవాదులు నిత్యం పని ఒత్తిడిలో ఉంటారని, వారికి మానసిక ప్రశాంతతో పాటు ఉత్సాహంగా ఉండేందుకు ఆటలు ఉపయోగపడతాయన్నారు.

అనంతరం ఎఎఎసిటి ఆర్గనైజింగ్ కమిటీ సెక్రటరీ పొన్నూరి సురేష్ కుమార్ అధ్యక్షత వహించిన కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్, జస్టిస్ డివిఎస్ఎస్ సోమయాజులు , జస్టిస్ కె.లలిత కుమారి, హైకోర్టు అడ్వకేట్ జనరల్ ఎస్. శ్రీరామ్ లను కృష్ణా మిల్క్ యూనియన్ ఛైర్మన్ చలసాని ఆంజనేయులు ఘనంగా సత్కరించి, మెమోంటోలను అందచేశారు.

ఈ కార్యక్రమంలో ఎపి బార్ కౌన్సిల్ చైర్మన్ ఘంటా రామారావు, ఎపి క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు పి. శరత్ చంద్రారెడ్డి, ఎఎసిటీ ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ చలసాని అజయ్ కుమార్, వైస్ ఛైర్మన్లు జి. శ్రీనివాసులు రెడ్డి, పి.వెంకట రెడ్డి, పి.బాజి షరీఫా ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమెరికాలో 23 నిమిషాల్లో తెలంగాణ వ్యక్తి సూర్య నమస్కారం..