Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కూరగాయలు మండుతున్నాయ్

webdunia
బుధవారం, 25 మార్చి 2020 (08:12 IST)
ఏపీలో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. అందుబాటులో లేక కొన్ని చోట్ల, అందినకాడికి దండుకుందామన్న దురాశతో ఇంకొన్ని చోట్ల విపరీతంగా ధరలు పెంచేశారు. దీంతో సామాన్యుడి జేబులకు చిల్లులు పెడుతున్నారు.

నిత్యా వసరాలు, కూరగాయలు, గుడ్లు, ఇతర వస్తువుల ధరలను అమాంతంగా పెంచి జలగల్లా పీల్చిపిప్పి చేసి కష్టజీవి శ్రమను దోచుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలులో ఉండటాన్ని ఆసరాగ చేసుకుని నిత్యావసరాలను అధిక ధరలకు విక్రయిస్తూ జేబులు నింపుకుంటున్నారు.

ప్రభుత్వం అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని చేస్తున్న హెచ్చ రికలు కేవలం మైక్‌లకే పరిమితమవుతున్నాయి. విజయవాడ, విశాఖ, గుంటూరు, రాజమండ్రి, ఏలూరు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అనంత పురం, కాకినాడ వంటి ప్రముఖ పట్టణాల్లో ఇంత భారీ గా దోపిడి జరుగుతున్న అధికార యంత్రాంగం మాత్రం నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరిస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ముఖ్యంగా విజయ వాడ, గుంటూరు నగరాలలో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. నిత్యావసరాల కోసం ప్రజలు పరుగులుపెట్టడంతో వ్యాపారులు కొత్త దోపిడికి తెరతీశారు. ఉదాహరణకు కిలో కందిపప్పు లాక్‌ డౌన్‌కు ముందు రూ.83లు ఉంటే ఇప్పుడు ఏకంగా దానిన రూ.130 నుంచి రూ.140కు విక్రయిస్తున్నా రు.

ఇదే విధంగా మిగిలిన నిత్యావసరాలు, నూనెల ధరలు కూడా రూ.15 నుంచి రూ.20లకు పెంచి విక్ర యిస్తున్నారు. కూరగాయల ధరలకు వస్తే అమ్మబోతే అడ వి, కొనబోతే కొరివి అన్న చందానగా మారింది. రైతులకు గిట్టుబాటు ధర లేక అల్లాడుతూ వ్యాపారి చెప్పిన ధరకే విక్రయిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అయితే లాక్‌డౌన్‌ నేపథ్యంలో కూరగాయల విక్రయ దారుల దోపిడికి హద్దు లేకుండా పోయింది.

ఇప్పటి వరకు కిలో వంకయాలు రూ.10లు లోపు ఉంటే నేడు రైతు బజారులోనే రూ.100కు విక్రయాలు సాగించారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు బెండకాయలు, దొండకా యలు, బీరకాయ ధరలు సైతం విపరీతంగా పెంచేశా రు. కిలో ఒక్కంటికి రూ. 60 నుంచి రూ.80 వరకు విక్రయిస్తూ సామాన్యుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు.

రైతు బజార్లలో ఉండాల్సిన కూరగాయా లు బహిరంగమార్కెట్‌కు తరలిస్తూ కమిషన్ల కోసం కక్కుర్తి పడుతున్నారు. మరోవైపు మొన్నటి వరకు కన్నీళ్లు తెప్పించిన ఉల్లి ధరలు ఇటీవలే సామాన్యుడికి అందుబాటులోకి వచ్చాయి. అయితే వాటిని కూడా ఇప్పటి వరకు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే కరోనా వైరస్‌ నేపథ్యంలో రవాణ సౌకర్యం లేదని, బ్లాక్‌లో సరుకు తెస్తున్నామని వ్యాపారులు సమాధానం చెబుతున్నారు.

గడిచిన నాలుగు రోజులుగా రాష్ట్రవ్యాప్తం గా వ్యాపారుల దోపిడి ఇదే విధంగా కొనసాగుతున్నా పట్టించుకున్న దాఖలాలు ఏమాత్రం లేవు. కనీసం తూనికలు,కొలతలు శాఖ అధికారులు కూడా ఏ మాత్రం బాధ్యత తీసుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కూరగాయల ధరలు మూడు నుంచి నాలుగు రెట్లు పెరగడంతో మాంసాహర ఉత్పత్తులపై ప్రజల దృష్టి పడింది.

అయితే కరోనా వైరస్‌ విస్తరిస్తున్న నేప థ్యంలో కోళ్ల పరిశ్రమ పూర్తిగా దెబ్బతింది. మూడు కేజీల చికెన్‌ రూ.100కు ఇచ్చే పరిస్థితి ఏర్పడింది. ఇదే సమయంలో కోడిగుడ్డు ధర కూడా దిగి వచ్చింది. అయితే గడిచిన రెండు రోజులా జరుగుతున్న పరిణామాలు, లాక్‌డౌన్‌ ఈ వ్యాపారులకు మంచి ఆదాయ వనరుగా మారింది.

కోడిగుడ్ల ధర రెండు రోజుల క్రితం వరకు కేవలం రూ.2లు ఉండగా, ఇప్పుడు అమాంతంగా రూ. 4 నుంచి రూ.10లకు చేరింది. కోడిగుడ్ల కోసం జనం ఎగబడుతుండటంతో వ్యాపా రులు హస్తలాఘవాన్ని చూపుతూ ఇష్టానుసారంగా దోపిడి చేస్తున్నారు.

ఇదే పరిస్థితి కొనసాగితే సామా న్యుడి జీవనం దుర్భరంగా మారే పరిస్థితులు ఉన్నా యనడంలో ఎటువంటి సందేహం లేదు. కరోనా నేపథ్యంలో ఒకవైపు రోజువారీ పనులు కూడా లేక పస్తులు ఉండే పరిస్థితి ఉంటే వ్యాపారులు సాగిస్తున్న దోపిడిని ఆరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.

Share this Story:

Follow Webdunia Hindi

తర్వాతి కథనం

నష్టాల్లో ఏపీఎస్‌ఆర్టీసీ