భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆంధ్రప్రదేశ్ అంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఐఎండీ ఎల్లో హెచ్చరిక జారీ చేసింది. సెప్టెంబర్ 29, 2025 వరకు రాబోయే ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. సెప్టెంబర్ 25 నాటికి ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇది సెప్టెంబర్ 26 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. బుధవారం జారీ చేసిన ఐఎండీ బులెటిన్ ప్రకారం, ఈ అల్పపీడనం సెప్టెంబర్ 27 నాటికి దక్షిణ ఒడిశా-ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాలను దాటే అవకాశం ఉంది.
దీని వలన తీరప్రాంత ఆంధ్రప్రదేశ్ అంతటా భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయి. గురు,శుక్రవారాల్లో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.
సెప్టెంబర్ 26-27 తేదీల్లో శ్రీకాకుళం అంతటా భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ-యానాం, డా.బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం జిల్లాలు గడిచిన 24 గంటల్లో శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా (9 సెం.మీ.), విజయనగరం (7 సెం.మీ.), అనకాపల్లి (7 సెం.మీ.), పార్వతీపురం మన్యం (5 సెం.మీ.) వర్షపాతం నమోదైంది.