ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తికి పెద్దలు అంటే ఎనలేని గౌరవం ఉంది. ఇది పలుమార్లు నిరూపితమైంది కూడా. తాజాగా మరోమారు మరో అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఈ అపురూపఘటం విజయనగరం జిల్లా రాజాంలౌని జీఎంఆర్ కళాశాలలో కనిపించింది.
ఆదివారం జీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో నారాయణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆ తర్వాత వేదికపై ఉన్న జీఎంఆర్ గ్రూపు అధినేత గ్రంథి మల్లారావు సోదరుడు గ్రంథి నీలాచలం వద్దకు వెళ్లి మోకాళ్లపై కూర్చొని పాదాభివందనం చేశారు.
ఈ వేడుకకు హాజరైన వందలాది మంది విద్యార్థులు, ప్రముఖులకు ఈ అపురూప ఘట్టం స్ఫూర్తినినింపింది. పెద్దలంటే ఆయనకున్న గౌరవం, ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలనే విషయాన్ని ఆయన చెప్పకనే చెప్పారని సభికులు హర్షధ్వానాలు వ్యక్తం చేశారు.