ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచకాలు ఎక్కువైపోతున్నాయి. ముఖ్యంగా, వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ శ్రేణులు ఇష్టానుసారంగా రెచ్చిపోతున్నారు. విపక్షాలకు చెందిన ఆస్తులు, గృహాలను ధ్వంసం చేస్తున్నారు. తమ ప్రత్యర్థులపై కూడా వారు దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా కూడా తెనాలిలో అన్నా క్యాంటీన్‌కు నిప్పు పెట్టారు.
గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసింది. వీటిని వైకాపా ప్రభుత్వం మూసివేసింది. అయితే, కొన్ని ప్రాంతాల్లో టీడీపీ నేతలే సొంత నిధులతో ఈ క్యాంటీన్లను నడుపుతూ చౌక ధరకే పేదల కడుపు నింపుతున్నారు.
ఈ క్రమంలో తెనాలిలో మూతపడిన అన్నా క్యాంటీన్‌కు గత రాత్రి కొందరు దండగులు నిప్పు పెట్టారు. ఆ సమయంలో అటుగా వస్తున్న స్థానికులు గమనించి, పోలీసులకు సమాచారం అందించారు.