Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఐరన్ స్కేలుతో కంటిపై కొట్టిన టీచర్.. చూపు కోల్పోయిన విద్యార్థి

విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన ఓ టీచర్ అతికిరాతకంగా ప్రవర్తించింది. ఫలితంగా ఓ విద్యార్థి చూపును కోల్పోయాడు. ఈ దారుణం గుంటూరు జిల్లా సంగడిగుంటలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, గుంటూరు జిల్లా రేపల్

ఐరన్ స్కేలుతో కంటిపై కొట్టిన టీచర్.. చూపు కోల్పోయిన విద్యార్థి
, గురువారం, 23 నవంబరు 2017 (17:45 IST)
విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన ఓ టీచర్ అతికిరాతకంగా ప్రవర్తించింది. ఫలితంగా ఓ విద్యార్థి చూపును కోల్పోయాడు. ఈ దారుణం గుంటూరు జిల్లా సంగడిగుంటలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, గుంటూరు జిల్లా రేపల్లె మండలం కోటిమెరకకు చెందిన గరికపాటి పద్మజ కుమారుడు రామ్‌కుమార్ ‌(10) అనే బాలుడు స్థానికంగా ఉండే రాఘవ విద్యాలయంలో ఐదో తరగతి చదువుతున్నాడు. ప్రతి రోజూ బసులో స్కూలుకు వెళ్లివచ్చే ఈ బాలుడు... గత సెప్టెంబరు 14న బస్సులో పిల్లలు అల్లరి చేస్తుండగా, అదే స్కూల్‌లో టీచర్‌గా పనిచేసే క్రోసూరి నాగలక్ష్మి చేతిలో ఉన్న ఐరన్‌ స్కేల్‌తో కొట్టింది. అది వేగంగా వచ్చి రామ్‌కుమార్‌ కంటిని తాకింది. 
 
కంట్లో నుంచి తీవ్ర రక్తస్రావం కావడంతో పెదకాకాని శంకర నేత్రాలయానికి తీసుకెళ్లారు. ఆదేనెల 16న అక్కడి వైద్యులు సర్జరీ నిర్వహించారు. ఆ తర్వాత కూడా చూపు మెరుగు పడకపోవడంతో హైదరాబాద్‌లోని ఎల్‌వీ ప్రసాద్‌ ఐ ఆస్పత్రికి తీసుకెళ్లమని చెప్పగా, అక్కడ 15రోజులుగా చికిత్సను అందించినా ఫలితం లేదు. నల్లగుడ్డు తీవ్రంగా దెబ్బతినడంతో చూపు వచ్చే అవకాశం లేదని వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆ బిడ్డ తల్లి గుండె బద్ధలైంది. దీనిపై పోలీసు కేసు పెట్టేందుకు ఆమె సిద్ధమైంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుపతిలో సీనియర్ సివిల్ జడ్జి ఆత్మహత్య