Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పంట సంరక్షణకు గుంటూరు రైతు వినూత్న ఆలోచన!

పంట సంరక్షణకు గుంటూరు రైతు వినూత్న ఆలోచన!
, శనివారం, 8 ఫిబ్రవరి 2020 (03:25 IST)
గుంటూరు జిల్లాలో ఓ యువరైతు అడవి పందుల బారి నుంచి తన పంటను కాపాడుకోవటానికి సరికొత్తగా ఆలోచించాడు. పొలంలో వాయిస్ రికార్డర్​ మైకులో తన వాయిస్​ని రికార్డు చేసి రాత్రి వేళల్లో రికార్డర్​ను చెట్టుకు కట్టి వినిపిస్తూ వాటి బెడద నుంచి పంటను రక్షించుకుంటున్నాడు.

అడవి పందుల బెడద నుంచి పంటను కాపాడుకోవటానికి గుంటూరుకు చెందిన ఓ యువరైతు వినూత్నంగా ఆలోచించాడు.  ఉడిజర్ల గ్రామానికి చెందిన వెంకటేశ్వర్​రెడ్డి తన రెండెకరాల కంది పంటను కాపాడుకోవటానికి వెయ్యి రూపాయలు వెచ్చించి రికార్డింగ్ మైక్​ను కోనుగోలు చేశాడు.

అందులో తన వాయిస్ నిక్షిప్తం చేసి రాత్రి వేళల్లో పొలం వద్ద దానిని ఓ చెట్టుకు కట్టి ఉంచుతున్నాడు. దాని నుంచే వచ్చే శబ్ధం కారణంగా అటు వైపు అడవి జంతువులు రాకుండా తన పంట సురక్షింతంగా కాపాడుకోగలుగుతున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు