ఈనెల 11, 12న రాష్ట్రవ్యాప్తంగా దీక్షలు చేయాలని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ పిలుపునిచ్చింది. ప్రభుత్వంలో విలీనం పేరుతో తొలగిస్తున్న సౌకర్యాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేసింది.
డిమాండ్ల సాధనకు నిరాహార దీక్షలు చేయాలని ఆర్టీసీ ఈయూ(ఎంప్లాయిస్ యూనియన్) నిర్ణయించింది. ఈ నెల 11, 12న రాష్ట్రవ్యాప్తంగా దీక్షలు చేయాలని పిలుపునిచ్చింది.
విలీనం పేరుతో తొలగిస్తున్న సౌకర్యాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేసింది. సంస్థను నిర్వీర్యం చేసే నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని పేర్కొంది.
పొరుగుసేవల డ్రైవర్లు, కండక్టర్లను విధుల్లోకి తీసుకోవాలని కోరింది. ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేలా ఆర్టీసీ ఎండీ నిర్ణయాలు ఉన్నాయని ఆరోపించింది.