Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గిరిజన యువకుడిని చావబాది.. నోట్లో మూత్రం పోశారు..

Advertiesment
crime scene
, బుధవారం, 19 జులై 2023 (09:10 IST)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలనతో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ వర్గాలకు ఏమాత్రం రక్షణ లేకుండా పోయిందంటూ విపక్ష నేతలు బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఓ గిరిజన యువకుడని కొందరు వ్యక్తులు చావబాది.. నోట్లో మూత్రం పోశారు. పైగా, మర్మాంగాన్ని నోట్లో పెట్టుకోవాలన బలవంతం చేస్తూ చితకబాదారు. ఈ ఘటన మొత్తం వీడియో తీశారు. నెల రోజుల క్రితం జరిగిన ఈ అమానవీయ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
బాధితుడైన గిరిజన యువకుడి పేరు మోటా నవీన్. ప్రధాన నిందితుడు మన్నె రామాంజనేయులు (అంజి) ఇద్దరూ చిన్నప్పటి నుంచి స్నేహితులు. నేరాలు పాల్పడే వీరిపై 50కిపైగా గృహ దొంగతనాల కేసులు ఉన్నాయి. నవీన్ పలుమార్లు జైలుశిక్ష కూడా అనుభవించాడు. అంజి మాత్రం కొన్నేళ్లుగా పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్నాడు. కొంతకాలంగా వీరిమధ్య గొడవలు జరుగుతున్నాయి.
 
ఈ క్రమంలో నెల రోజుల క్రితం మద్యం తాగుదామంటూ నవీన్‌ను అంజి ఒంగోలులోని కిమ్స్ ఆసుపత్రి వద్దకు పిలిచాడు. వెళ్తే అక్కడ మొత్తం 9 మంది కనిపించారు. అక్కడ అందరూ కలిసి మద్యం తాగారు. ఆపై అంజి, నవీన్ మధ్య పాత గొడవ మరోమారు రేగింది. దీంతో అందరూ కలిసి నవీన్‌పై దాడిచేశారు. తనను వదిలెయ్యాలని బతిమాలినా వినిపించుకోలేదు. రక్తమోడేలా కొట్టారు. ఆపై నవీన్ నోట్లో మూత్రం పోస్తూ మర్మాంగాన్ని అతడి నోట్లో పెట్టుకోమని బలవంతం చేశారు. కొందరు ఈ తతంగం మొత్తాన్ని తమ మొబైల్ ఫోనులో చిత్రీకరించారు.
 
ఆ తర్వాత బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అదికాస్తా ఉన్నతాధికారుల దృష్టిలో పడింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉండగా, ఇద్దరిని మాత్రం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారతదేశంలో Realme C53 విడుదల.. ఫీచర్స్ ఇవే