Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అసెంబ్లీ నిర్మాణం అద్భుతం... నాకు లభించిన మహద్భాగ్యం : ఈఎస్ఎల్ నరసింహన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో అతి తక్కువ కాలంలో నిర్మించిన అసెంబ్లీ నిర్మాణం అద్భుతంగా ఉందని, ఇక్కడ ప్రారంభమైన తొలి సమావేశాల్లో తాను కూడా భాగంకావడం, తనకు జీవితంలో లభించిన మహద్భాగ్యమని తెలుగు

అసెంబ్లీ నిర్మాణం అద్భుతం... నాకు లభించిన మహద్భాగ్యం : ఈఎస్ఎల్ నరసింహన్
, సోమవారం, 6 మార్చి 2017 (12:17 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో అతి తక్కువ కాలంలో నిర్మించిన అసెంబ్లీ నిర్మాణం అద్భుతంగా ఉందని, ఇక్కడ ప్రారంభమైన తొలి సమావేశాల్లో తాను కూడా భాగంకావడం, తనకు జీవితంలో లభించిన మహద్భాగ్యమని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అన్నారు. 
 
ఏపీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. అసెంబ్లీ నిర్మాణాన్ని రికార్డు సమయంలో అత్యంత ఆధునిక సాంకేతికత, పూర్తి ఎల్ఈడీ వెలుగులతో నిర్మించారని గుర్తుచేశారు. 
 
రాష్ట్రాన్ని పెట్టుబడులకు కేంద్రంగా చేయడంలో తన ప్రభుత్వం ఎంతో ముందడుగు వేసిందని, ఇప్పటికే లక్షల కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులు, నూతన ఉద్యోగాలు రాష్ట్రానికి వచ్చాయని, మరిన్ని కంపెనీలు రానున్నాయని అన్నారు. రాష్ట్రం ఏర్పడిన రెండేళ్లలోనే రెండంకెల వృద్ధిని చేరుకున్నామన్నారు. 
 
ఇకపోతే నదుల అనుసంధానంలో దేశంలోనే ముందు నిలిచిన రాష్ట్రంగా ఏపీ చరిత్ర సృష్టించిందని అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం శరవేగంగా జరుగుతోందని, ఈ ప్రాజెక్టు పూర్తయితే, లక్షలాది ఎకరాలు గోదావరి నీటితో సస్యశ్యామలమవుతాయని అన్నారు. తోటపల్లి, వెలుగొండ ప్రాజెక్టులు సైతం అనుకున్న సమయంలోగా పూర్తవుతాయని అన్నారు.
 
వర్షాలు తక్కువగా ఉన్నా ఈ రంగంలో మంచి వృద్ధిని సాధించామని చెప్పుకొచ్చారు. వ్యవసాయాన్ని మరింత లాభదాయకం చేసేందుకు రైతులకు రాయితీపై యంత్రాల సరఫరా జరుగుతోందని, సంక్షోభాలను రాష్ట్రం అవకాశాలుగా మలచుకోవడంలో విజయం సాధించిందని ఆయన గుర్తు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మద్యం విక్రయాల్లో శశికళ కుటుంబం రికార్డు.. 14 ఏళ్లలో రూ.20 వేల కోట్లకు విక్రయాలు