Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

క‌ల్ప‌వృక్ష వాహనంపై గోకుల నందనుడు

క‌ల్ప‌వృక్ష వాహనంపై గోకుల నందనుడు
, సోమవారం, 19 అక్టోబరు 2020 (20:44 IST)
తిరుపతి తుమ్మలగుంట శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో నాలుగో రోజైన సోమవారం శ్రీ వారు కల్పవృక్ష వాహనంపై గోకుల నందనుడి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. గోవుల గోప‌న్న‌గా శ్రీవారు భక్తులను కటాక్షించారు.

క్షీరసాగరమథనంలో ఉద్భవించిన  క‌ల్ప‌వృక్షం నీడన చేరిన వారికి ఆకలిదప్పులుండవు, కోరుకున్న‌ కోరికలు నెరవేరుతాయని వేద పండితులు పేర్కొన్నారు. అంతటి విశిష్టత కలిగిన క‌ల్ప‌వృక్ష‌ వాహనాన్ని అధిరోహించి స్వామి వారు ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తుల కోర్కెలను తీర్చారు.

గోవింద మాల ధారణతో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త, ప్రభుత్వ విప్, తుడా చైర్మెన్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ సతీసమేతంగా పాల్గొన్నారు. కంకణ డారుడైన చెవిరెడ్డి తమ్ముడు రఘునాథ్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. 
 
సర్వభూపాల వాహనంపై..
శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు సోమవారం రాత్రి ఆలయ మాడ వీధుల్లో స్వామివారు ఉభయదేవేరులతో కలిసి సర్వభూపాల వాహ‌నంపై భక్తులకు దర్శనమిచ్చారు. అంతకుముందు ఊంజల్ సేవ వేడుకగా నిర్వహించారు. వాహన సేవలో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త  డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. 
 
మంగళవారం బ్రహ్మోత్సవాలు ..
బ్రహ్మోత్సవాలలో ఐదో రోజైన మంగళవారం ఉదయం మోహినీ అవతారం, రాత్రి గరుడ వాహనంపై కళ్యాణ వెంకన్న విహరిస్తూ భక్తులను కటాక్షించనున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వ‌ర‌ద ప్రాంతాల్లో ఉచిత రేష‌న్: జ‌గ‌న్ ఆదేశం