2006లో ఓ చానల్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణులను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన ఘటనపై తాజాగా క్షమాపణలు చెప్పారు ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు.
గరికపాటి నరసింహారావు 2006 సంవత్సరంలో విశ్వబ్రాహ్మణులకు కించపరిచే విధంగా మాట్లాడారని కొంత కాలంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్వర్ణకారులు. ఈ వ్యాఖ్యలను వెనకు తీసుకుని.. గరికపాటి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ క్రమంలో శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో విశ్వ బ్రాహ్మణులు ర్యాలీ నిర్వహించి జంగారెడ్డిగూడెం పోలీస్‌స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు స్వర్ణకారులు. వెంటనే తమకి క్షమాపణలు చెప్పాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్వర్ణకారులు రోడ్డుపై భైఠాయించి ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ ఘటనపై గరికపాటి.. విశ్వబ్రాహ్మణులకు సారీ చెప్పారు. తన వ్యాఖ్యల వల్ల స్వర్ణకారులు బాధపడుతున్నందున వారికి క్షమాపణలు చెబుతున్నానన్నారు. తప్పుగా మాట్లాడితే క్షమించాలని కోరారు. దీంతో విశ్వ బ్రాహ్మణులు ఆందోళన విరమించారు.