Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆంధ్రాలో మొబైల్ థియేటర్... 'ఆచార్య'తో ఆరంభం

Advertiesment
mobile theater
, శుక్రవారం, 15 ఏప్రియల్ 2022 (07:28 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారి మొబైల్ థియేటర్ అందుబాటులోకి వచ్చింది. ఈ థియేటర్‌ను మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఆచార్య' చిత్రం విడుదలతో ప్రారంభించనున్నారు. ఈ మొబైల్ థియేటర్‌లో తొలి ఆటగా 'ఆచార్య' సినిమాను ప్రదర్శించనున్నారు. దీన్ని పిక్చర్ డిజిటల్ అనే సంస్థ రూపొందించింది. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం వద్ద ప్రస్తుతం ఏర్పాటు చేశారు. 
 
ఈ మొబైల్ థియేటర్‌ను కంటైనర్ తరహాలో ఎక్కడికైనా తరలించే అవకాశం ఉంది. పైగా, అన్ని వాతావరణ పరిస్థితులు తట్టుకునేలా రూపొందించారు. మొత్తం 120 సీట్ల కెపాసిటీ కలిగివుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ తరహా మొబైల్ థియేటర్ అందుబాటిలోకి రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ప్రస్తుతం రాజానగరం వద్ద జాతీయ రహదారి పక్కనే ఉన్న హబిటేట్ ఫుడ్ కోర్టు ఆవరణలో దీన్ని ఏర్పాటు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అక్భరుద్ధీన్‌ను వదిలేది లేదు.. కేసీఆర్‌ భయం లేదు..? బండి సంజయ్