Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భాషా ప‌రిజ్ఞానం పెంచేందుకు వేలివెన్ను ఉన్న‌త పాఠ‌శాల కృషి

భాషా ప‌రిజ్ఞానం పెంచేందుకు వేలివెన్ను ఉన్న‌త పాఠ‌శాల కృషి
విజ‌య‌వాడ‌ , మంగళవారం, 25 జనవరి 2022 (11:26 IST)
ఈ కాలం విద్యార్థుల‌ చ‌దువు అంతా ఫాస్ట్ అయిపోయింది. త‌మ‌కు అవ‌స‌ర‌మైన స‌బ్జెక్టులు చ‌క‌చ‌కా బ‌ట్టీ  వేయ‌డం త‌ప్ప‌, జీవితాంతం ఉప‌యోగ‌ప‌డే, అత్య‌వ‌స‌ర‌మైన భాషా ప‌రిజ్ణ్నానం మాత్రం శూన్యం. అందుకే ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా వేలివెన్ను ఉన్న‌త పాఠ‌శాల ఈ ల్యాంగ్ వేజ్ ఇంప్రూవ్ మెంట్ ప్రోగ్రాంపై దృష్టి పెట్టింది. దీనితో పిల్ల‌ల‌కు స‌హ‌కరించేందుకు దాత‌లు కూడా ముందుకు వ‌స్తున్నారు.
 
 
ఉండ్రాజ‌వ‌రం మండ‌లం వేలివెన్ను కాంప్లెక్స్ లో వేలివెన్ను, కాల్ద‌రి ప‌రిధిలోని ప్రాథ‌మిక‌, ఉన్న‌త పాఠ‌శాల‌లో 800 మంది వ‌ర‌కు విద్యార్థినీ విద్యార్థులున్నారు. వీరికి వేలివెన్ను ఎం.పి.పి.ఎస్. నెం.3లో సెకండ‌రీ గ్రేడ్ ఉపాధ్యాయినిగా ప‌నిచేస్తున్న పి.కుసుమ ముందుకు వ‌చ్చి ఆర్ధిక స‌హాయం చేశారు. విద్యార్థులంద‌రికీ ల్యాంగ్ వేజ్ ఇంప్రూవ్ మెంట్ ప్రోగ్రాం పుస్త‌కాల‌ను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్య‌క్ర‌మాన్ని ద‌గ్గ‌రుండి న‌డిపించిన ఉన్న‌త పాఠ‌శాల ప్ర‌ధానోపాధ్యాయుడు ఎం. వెంక‌ట‌ప‌తిరావు ఎంత‌గానో అభినందించారు. 
 
 
విద్యార్థుల‌కు భాషా ప‌రిజ్ణ్నానం ఈ రోజుల్లో ఎంతో ముఖ్య‌మ‌ని, దీనికి ఒక ఉపాధ్యాయురాలిగా స‌హ‌క‌రించి, ఉచితంగా పుస్త‌కాలు పంపిణీ చేసిన ఉపాధ్యాయిని పి.కుసుమను అభినందించారు. ఈ కార్య‌క్ర‌మంలో ప్రాథ‌మిక పాఠ‌శాల ప్ర‌ధానోపాధ్యాయుడు జి.వెంక‌టేశ్వ‌ర‌రావు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు విద్య‌తోనే అభివృద్ధిని సాధించ‌గ‌ల‌ర‌ని, అందుకే అన్ని స‌బ్జెక్టుల్లో రాణించాల‌ని సూచించారు. ఈ కార్య‌క్ర‌మంలో వేలివెన్ను కాంప్లెక్స్ లోని ప్రాథ‌మిక‌, ఉన్న‌త పాఠ‌శాల‌ల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు