Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాజ్ భవన్ ఉద్యోగుల కోసం.. కర్దాతా ఇ-సహ్యోగ్ అభియాన్

రాజ్ భవన్ ఉద్యోగుల కోసం.. కర్దాతా ఇ-సహ్యోగ్ అభియాన్
, బుధవారం, 21 ఆగస్టు 2019 (20:34 IST)
ఆదాయపు పన్ను శాఖ నూతనంగా రూపొందించిన కర్దాతా ఇ-సహ్యోగ్ అభియాన్  కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ప్రారంభించారు. రాజ్ భవన్లో బుధవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో గవర్నర్ దీనిని ఆవిష్కరించారు.

ఆదాయపు పన్ను రిటర్న్స్ ఇ-ఫైలింగ్ - హెల్ప్ డెస్క్ లో భాగంగా ఆ శాఖ ఈ నూతన విధానాన్ని సిద్దం చేసింది. గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, విజయవాడ ఆదాయపు పన్ను ప్రిన్సిపల్ కమిషనర్ ఎం.భూపాల్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. అదాయపు పన్ను వసూలులో మంచి ప్రగతిని సాధించటం శుభపరిణామన్నారు.

సమాజంలోని విభిన్న వర్గాల ప్రయోజనం కోసమే ప్రభుత్వం అదాయపు పన్ను వసూళ్లను వినియోగిస్తుందన్న విషయాన్ని మరువరాదన్నారు. పన్ను చెల్లింపు దారుల సంఖ్య కూడా గణనీయంగా పెరగటం శుభపరిణామని, ఇది దేశ ఆర్ధిక అభివృద్దికి చిహ్నమన్నారు. సమాజ ప్రయోజనాల కోసమే పన్ను చెల్లిస్తున్నామన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు.
 
రాజ్ భవన్ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా అదాయపు పన్ను శాఖ ప్రత్యేకంగా అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించింది.  ఈ నేపధ్యంలో భూపాల్ రెడ్డి మాట్లాడుతూ  2019 ఆగస్టు 31 లోగా ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయకుంటే రూ.5,000 నుండి పదివేల వరకు జరిమానా చెల్లించవలసి రావచ్చని, దానిని అధికమించేందుకు సకాలంలో రిటర్న్ దాఖలు చేయాలని సూచించారు.

ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలుకు  ఇ-ఫైలింగ్, ఆన్‌లైన్ ఫైలింగ్ వంటి వాటిని సులువైన ప్రక్రియగా మార్చామని, తమ శాఖ ఇ-ఫైలింగ్ వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయితే రిటర్న్ ఫైల్ చేయడానికి ఐదు నిమిషాలు మాత్రమే పడుతుందని ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయడం ద్వారా పన్ను చెల్లింపుదారునికి వివిధ రకాల రుణాలు పొందటం సులభతరం అవుతుందని, పన్ను ప్రతాల దాఖలు అనేది అయా వ్యక్తుల సౌలభ్యం కోసమేనన్నది గుర్తించాలని  సూచించారు.
 
కనీసం మూడు సంవత్సరాలు ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు అనేది విభిన్న అవసరాలకు తప్పనిసరిగా ఉందని భూపాల్ రెడ్డి పేర్కొన్నారు. ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ.. పన్ను పత్రాల దాఖలు విషయంలో అలసత్యం కూడదని, ఆ శాఖ నూతనంగా తీసుకువచ్చిన కార్యక్రమం అనుసరణీయంగా ఉందన్నారు. పన్ను చెల్లింపు దారులు దేశ అభివృద్దిలో పరోక్ష భాగస్వాములన్నారు.

2018-19 ఆర్ధిక సంవత్సరంలో  రూ .9047 కోట్ల ఆదాయపు పన్ను వసూలు చేయబడిందని, 2019-20 సంవత్సరం కోసం రూ .11308 కోట్లు లక్ష్యంగా కలిగి ఉన్నామని అదాయపు పన్ను శాఖ అధికారులు గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ కు వివరించారు. ఆంధ్రప్రదేశ్లో ఆదాయపు పన్ను చెల్లింపుదారుల సంఖ్య 7.32 లక్షలకు చేరిందన్నారు. 

కార్యక్రమంలో రాజ్ భవన్ సంయిక్త కార్యదర్శి అర్జున రావు, అదాయపు పన్ను శాఖ సంయిక్తం కమీషనర్ సంధ్యారాణి, సహాయ కమీషనర్ శ్వేత, టాక్స్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జి.సత్యనారాయణ, ఎస్ఐఆర్సి విజయవాడ చాప్టర్  చైర్‌పర్సన్ వై.నాగవల్లి పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టీడీపీని వీడను.. దివ్యవాణి