అక్టోబర్‌లో ప్రకాశం బ్యారేజీ నుంచి శ్రీశైలం వరకు ఆంధ్రప్రదేశ్‌లో తొలి సీప్లేన్ ప్రదర్శన వుంటుందని పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్‌మోహన్‌నాయుడు ప్రకటించారు. ఆ తర్వాత దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఈ ప్రదర్శనలు నిర్వహిస్తామని తెలిపారు.
కొత్త మార్గదర్శకాలు భారతదేశంలో సీప్లేన్ కార్యకలాపాల అభివృద్ధిని ప్రోత్సహిస్తాయని కె. రామ్‌మోహన్‌నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. సాధారణ విమానాల మాదిరిగానే వాటిని వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చని రామ్‌మోహన్ నాయుడు పేర్కొన్నారు.
సాంప్రదాయ విమానాశ్రయాల మాదిరిగా కాకుండా, సీప్లేన్‌లు కనెక్టివిటీని మెరుగుపరచడానికి, సౌకర్యవంతమైన, సమర్థవంతమైన మార్గాలను అందిస్తాయి. సీప్లేన్‌లు పర్యాటకం నుండి సాధారణ ప్రయాణం, వైద్య అత్యవసర పరిస్థితుల వరకు ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు.
దేశంలో సీప్లేన్ కార్యకలాపాలను పెంచాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారని, ఈ దిశలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ చురుకుగా కొనసాగుతోందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.