శ్రీకాకుళం కోటి దీపోత్సవంలో అపశృతి అందుకేనా? (video)
కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ముక్కంటి అనుగ్రహం కోసం భక్తులు శివాలయాల చుట్టూ తిరిగారు. ఉపవాసాలుంటూ పంచాక్షరీ మంత్రాన్ని జపించారు. కార్తీకంలో పరమేశ్వరునికి దీపదానాలు చేశారు. ఈ క్రమంలో కోటి దీపోత్సవా
కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ముక్కంటి అనుగ్రహం కోసం భక్తులు శివాలయాల చుట్టూ తిరిగారు. ఉపవాసాలుంటూ పంచాక్షరీ మంత్రాన్ని జపించారు. కార్తీకంలో పరమేశ్వరునికి దీపదానాలు చేశారు. ఈ క్రమంలో కోటి దీపోత్సవాలు తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా జరిగాయి.
ఇటీవల హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో భక్తి టీవీ ఆధ్వర్యంలో కోటి దీపోత్సవం వైభవంగా జరిగింది. భక్తుల శివనామ స్మరణతో స్టేడియం ప్రాంగణం ఇల కైలాసాన్ని తలపించింది. ఈ సందర్భంగా ఉజ్జయినీ మహా శివలింగానికి భస్మాభిషేకం నిర్వహించారు. భక్తులచే శివలింగాలకు కోటి భస్మార్చన జరిపించారు.
ఇదే తరహాలో శ్రీకాకుళం జిల్లాలో జరిగిన కోటి దీపోత్సవం నిర్వహిస్తున్నారు. అయితే శ్రీకాకుళంలో జరిగిన కోటి దీపోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. కార్తీకమాసం ముగిసిన తరువాత ఈ దీపోత్సవాన్ని ఏర్పాటు చేశారని.. అందుకే ఈ దీపోత్సవ కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుందని సమాచారం. శనివారం దీపోత్సవంలో ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రమాదవశాత్తూ మంటలు ఎగసిపడటంతో క్షణికకాలంలోనే మంటలు వ్యాపించాయి. భక్తులు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు పెట్టారు. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం సంభవించలేదు. ఈ వీడియోను మీరూ చూడొచ్చు.