Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కన్నతండ్రే కూతురిపై అఘాయిత్యం.. గదిలో తలుపులు వేసి..?

Advertiesment
Father

సెల్వి

, గురువారం, 3 అక్టోబరు 2024 (16:25 IST)
మద్యం మత్తులో కన్నతండ్రే కూతురిపై అఘాయిత్యం చేసిన ఘటన నెల్లూరు జిల్లాలో సంచలనంగా మారింది. కొన్నిరోజులుగా తండ్రి చేస్తున్న దారుణాలను మౌనంగా భరిస్తున్న ఆ చిన్నారి చివరకు ధైర్యం చేసి తల్లికి విషయం చెప్పింది. 
 
భార్య, ముగ్గురు కుమార్తెలతో స్థానికంగా నివాసం ఉంటున్న ఆ నీఛుడికి మద్యం అలవాటు ఉంది. కన్నకూతురిపై తలుపులు వేసుకుని అకృత్యానికి పాల్పడ్డాడు. 
 
అరుపులు కేకలు ఎక్కువ కావడంతో తల్లికి అనుమానం వచ్చింది. ఇరుగు పొరుగుని పిలిచినా ఎవరూ రాలేదు. చివరకు తలుపు తెరిచిన తర్వాత కూతురు పరుగు పరుగున తల్లి వద్దకు వచ్చి జరిగిన విషయం చెప్పింది. అప్పుడు కానీ ఆ తండ్రి దుర్మార్గం బయటపడలేదు. 
 
ఇంట్లో తలుపులు వేసి కన్న కూతురిపైనే పశువులా ప్రవర్తించాడు తండ్రి. సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉన్న ఈ ఘటనతో స్థానికులు షాకయ్యారు. 
 
ఇలాంటి వ్యక్తి తమ పొరుగున ఉన్నాడని తెలిసి భయపడిపోయారు. అందరూ కలసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికను వైద్య పరీక్షలకు పంపించారు. తండ్రి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బెజవాడ కనకదుర్గమ్మకు కానుకగా వజ్రకిరీటం.. భారీ విలువైన ఆభరణాలు