Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

FASTag: ఆగస్టు 15 నుండి తిరుమలకు వెళ్లే అన్ని వాహనాలకు ఫాస్ట్‌ట్యాగ్ తప్పనిసరి

Advertiesment
Fasttag

సెల్వి

, బుధవారం, 13 ఆగస్టు 2025 (08:45 IST)
Fasttag
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆగస్టు 15 నుండి తిరుమలకు వెళ్లే అన్ని వాహనాలకు ఫాస్ట్‌ట్యాగ్‌ను తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. భద్రతా తనిఖీలను వేగవంతం చేయడం, ట్రాఫిక్‌ను సులభతరం చేయడం యాత్రికులకు సజావుగా ప్రవేశం కల్పించడం లక్ష్యంగా అలిపిరి చెక్‌పాయింట్ వద్ద ఈ నిబంధన అమలు చేయబడుతుంది. తిరుమల ప్రధాన ప్రవేశ స్థలం వద్ద వేగవంతమైన క్లియరెన్స్‌ను ప్రారంభించడం ద్వారా, ముఖ్యంగా రద్దీ సీజన్లలో, దీర్ఘకాలం వేచి ఉండే సమయాన్ని తగ్గించవచ్చని భావిస్తున్నారు. 
 
డిజిటల్ టోల్ చెల్లింపు వ్యవస్థ వాహనాల కదలికను మరింత సమర్థవంతంగా ట్రాక్ చేయడంలో, ఘాట్ రోడ్లపై భద్రతా చర్యలను బలోపేతం చేయడంలో కూడా సహాయపడుతుందని అధికారులు తెలిపారు. ఫాస్ట్ ట్యాగ్ లేని వాహనాలు చెక్ పాయింట్ దాటి ముందుకు వెళ్లడానికి అనుమతి లేదు. 
 
ఐసిఐసిఐ బ్యాంక్ భాగస్వామ్యంతో టిటిడి, అలిపిరి వద్ద ఆన్-సైట్ జారీ కౌంటర్‌ను ఏర్పాటు చేసింది. యాత్రికులు తక్కువ సమయంలోనే తమ వాహనాలపై ఫాస్ట్ ట్యాగ్‌ను ఇన్‌స్టాల్ చేసుకుని, ఆలయ పట్టణానికి తమ ప్రయాణాన్ని కొనసాగించవచ్చు. 
 
యాత్ర ప్రారంభించే ముందు తమ వాహనాల్లో ఫాస్ట్ ట్యాగ్ అమర్చబడిందని నిర్ధారించుకోవాలని టిటిడి భక్తులకు విజ్ఞప్తి చేసింది, ఇది జాప్యాలను నివారించడాని, ప్రవేశ ప్రక్రియను సులభతరం చేయడానికి సహాయపడుతుందని పేర్కొంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణలో ఆగస్టు 13-15 వరకు అతి భారీ వర్షాలు - HYDRAA అలెర్ట్