Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విశాఖపట్టణంలో లంకె బిందెలు - గుప్త నిధుల కోసం తవ్వకాలు.. కలకలం

Advertiesment
treasures
, సోమవారం, 18 డిశెంబరు 2023 (13:20 IST)
విశాఖపట్టణంలో లంకె బిందెలు, గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపుతున్నాయి. కంచరపాలెం పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన వెలుగు చూసింది. తాటిచెట్ల పాలెం రైల్వే క్వార్టర్స్‌లో ఇంటి ఆవరణలో పూజలు చేసిన తవ్వినట్టు స్థానికులు గుర్తించారు. రైల్వే ఉద్యోగి కోటేశ్వర రావు ఆధ్వర్యంలో 20 అడుగుల మేరకు గొయ్యి తవ్వకాలు జరిగినట్టు గుర్తించారు. గుప్త నిధుల తవ్వకాల కోసం విజయవాడ నుంచి కొందరు వ్యక్తులు వచ్చినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో గుర్తించారు.
 
ఈ గుప్త నిధుల కోసం తవ్వకాలు గత నెల రోజులుగా సాగించారని, చుట్టూ పరదాలు కప్పి, రాత్రుళ్లు దేవుడు పాటలు పెట్టుకుని కోటేశ్వర రావు చుట్టు పక్కల వాళ్లను ఏమార్చి ఈ తవ్వకాలు జరిపినట్టు సమాచారం. దోష నివారణ కోసం పూజలు చేశామంటూ సదరు వ్యక్తులు చెబుతున్నారు. స్వామీజీ చెప్పినట్టుగా చేశామని కోటేశ్వర రావు పోలీసులకు తెలిపారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై నటి విజయశాంతి ప్రశంసలు 
 
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరుపై కాంగ్రెస్ పార్టీ మహిళా నేత, నటి విజయశాంతి ప్రశంసల వర్షం కురిపించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావమైన తర్వాత శాసనసభ సమావేశాలు తొలిసారి విధానపరంగా జరుగుతున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ పరిణామం ఎంతో ఆనందదాయకమన్నారు. 
 
ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత రాష్ట్ర మూడో అసెంబ్లీ సమావేశాలు ఇటీవల ప్రారంభమై సజావుగా సాగుతున్నాయి. దీనిపై విజయశాంతి స్పందిస్తూ, 2014 తర్వాత సమావేశాలు ఇంత సాఫీగా, హుందాగా జరుగుతుండటం ఇదే తొలిసారన్నారు. సచివాలయం కూడా ఇపుడు పూర్తి స్థాయిలో పని చేస్తుందని తెలిపారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణాలో దాదాపు దశాబ్దం తర్వాత ప్రజాస్వామ్య పంథాలో పనిచేస్తుందని పేర్కొన్నారు
 
ఇది ప్రజా ప్రభుత్వమన్నారు. అందువల్ల అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రజాస్వామ్య పంథాలోనే నడుస్తుందని, కోట్లాడి మందికి ఇపుడిపుడే విశ్వాసం ఏర్పడుతుందన్నారు. అంతేకాకుండా 26 యేళ్ల పోరాటం తర్వాత మీ రాములమ్మ ఇపుడు ఏం చేయాలని ఎవరైనా తనను అడిగితే.. తెలంగాణ ప్రజలకు కాలం మేలు చేయాలని, ఈ భూమి బిడ్డల భవిష్యత్ ఎప్పటికీ బాగుండాలని మాత్రం మనస్ఫూర్తిగా కోలుకుంటానని విజయశాంతి పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై నటి విజయశాంతి ప్రశంసలు