Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇప్పటికిపుడు ఎన్నికలంటూ జరిగితే వైకాపా... : సబ్బం హరి జోస్యం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికిపుడు ఎన్నికలంటూ జరిగితే విపక్ష పార్టీ అయిన వైకాపా అడ్రస్ గల్లంతు కావడం ఖాయమని కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ సబ్బం హరి జోస్యం చెప్పారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ,

Advertiesment
ఇప్పటికిపుడు ఎన్నికలంటూ జరిగితే వైకాపా... : సబ్బం హరి జోస్యం
, సోమవారం, 10 సెప్టెంబరు 2018 (09:12 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికిపుడు ఎన్నికలంటూ జరిగితే విపక్ష పార్టీ అయిన వైకాపా అడ్రస్ గల్లంతు కావడం ఖాయమని కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ సబ్బం హరి జోస్యం చెప్పారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహిస్తే తెలుగుదేశం పార్టీదే విజయమన్నారు.
 
రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా చంద్రబాబు కన్నా మంచి నాయకత్వం ఇస్తామన్న భరోసాను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో ప్రతిపక్షాలు పూర్తిగా విఫలమయ్యాయని వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్‌ కుక్కలు చింపిన విస్తరిగా తయారైందని, పార్లమెంట్‌లో ప్రజాసామ్యానికి చోటు లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
 
ఏపీలో బీజేపీ ఉనికే లేదని, కేంద్ర ప్రభుత్వం ఏపీకి చేసిన అన్యాయం, మోసాల గురించి ప్రజలకు వివరించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తిగా సఫలమయ్యారన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ గ్రాఫ్‌ పడిపోతున్నదని, బీజేపీకి ప్రజాదరణ తగ్గిపోతున్నదని హరి అన్నారు. 2019లో జరిగే ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తానని, అయితే ఏ పార్టీ తరపున అనేది త్వరలో తెలియజేస్తానన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాలు పితికి ఆ పాలతోనే పాలాభిషేకం చేయించుకున్న ఎంపి(ఫోటోలు)